తమిళుల తలైవి... అక్కడి ప్రజలు అమ్మా అంటూ  ప్రేమగా పిలుచుకునే జయలలిత ఎంత గొప్ప నాయకురాలో  అందరికి తెలిసందే . తమిళుల గుండెల్లో అమ్మగా చెరగని ముద్ర వేసుకుంది జయలలిత .జయలలిత కన్ను మూసినా వేల తమిళులకు ఒక చీకటి రోజు . తాము ఆరాధించే అమ్మ దూరమయ్యింది  కొందరు అభిమానుల  గుండె ఆగిపోయింది  కూడా ... ఆమె చనిపోయిన ఆమె అభిమానులు  వాళ్ళ గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు . జయలలిత మెమోరియాల్ వద్ద ఓ వ్యక్తి తన కుమారుడి  వివాహ తంతు జరిపించి  ఆయనకు అమ్మ మీద ఉన్న అభిమానాన్ని  చాటుకున్నాడు .


 
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అన్నాడీఎంకే నేత భవానీ శంకర్  వీరాభిమాని. తన కుమారుడి పెళ్లి తంతు మొత్తం జయలలిత సమక్షంలో జరిపించి ...ఆమె ఆశీర్వాదం ఇప్పించాలనుకున్నాడు .కానీ జయలలిత లేకపోవటంతో  ఆమె మెమోరియల్ వద్ద పెళ్లి  జరిపేందుకు నిశ్చయించుకున్నాడు. దీనికోసం అధిష్టానాన్ని అనుమతి కోరగా మొదట నిరాకరించినా తర్వాత అంగీకరించారు .దీంతో జయలలిత మెమోరియల్ వద్దే పెళ్లి మండపం ఏర్పాటు చేసి ...మెమోరియల్ మొత్తం రకరకాల పూలతో  అలంకరించి ...అక్కడే  భావాన్ని శంకర్ కుమారుడు సాంబ శివరామన్ పెళ్లి జరిపించారు .


కాగా పెళ్లి అనంతరం జయలలిత ఫోటోకి నమస్కరించారు నూతన దంపతులు .జయలలిత తమతో బౌతికంగా లేకపోయినా ...తమ మదిలో వెన్నంటే  ఉందని ...అమ్మ సమక్షంలోనే తమ పెళ్లి జరిగినట్టు భావిస్తున్నామని ...అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని నూతన దంపతులు తెలిపారు .ఈ వివాహా వేడుకకు అన్నాడీఎంకే నేతలు,బంధువులు హాజరయ్యారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: