ఇటాలియన్ టూ వీలర్ సంస్థ బెనెల్లి తమ బైక్ లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. బెనెల్లి నుండి ఇంపీరియాలే 400 బైక్ ఇండియాలో రిలీజ్ చేసింది. అక్టోబర్ 22 నుండి ఈ బైకులు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ ధర 1.65 లక్షలుగా నిర్ణయించారు. 

 

బైక్ కోసం ఇండియాలో ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు 23 రోజుల్లో 352 బైకులు బుకింగ్ అయ్యాయి. లాంచ్ అయినా ఇంత తక్కువ రోజుల్లో ఇన్ని బైకులు బుక్ అవడం ఇదే మొదటిసారి. ఈ బుకింగ్ చుసి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు లకు షాక్ తగిలినట్టే. ప్రస్తుతం బెనెల్లి ఇండియాలో 24 షోరూముల్లో అందుబాటులో ఉంటుంది. 4000 అడ్వాన్స్ ఎమౌంట్ కట్టి దీన్ని బుక్ చేసుకోవచ్చు.


బెనెల్లి ఇంపీరియాలే 400 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కు గట్టి పోటీ ఇస్తుంది. 374 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ బి.ఎస్ 6 నాంస్ తో వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో 20.7 బి.హెచ్.పి పవర్, 29 ఎన్.ఎం టార్క్ తో ఈ బైక్ వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: