ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారత్‌ స్టేజ్‌ బీఎస్‌–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్‌ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టాండర్డ్‌ వేరియంట్‌తో పాటు అల్లాయ్ డ్రమ్‌ బ్రేక్‌, అల్లాయ్ డిస్క్‌ బ్రేక్‌, స్టీల్‌ డ్రమ్ బ్రేక్‌, అల్లాయ్ డిస్క్‌ బ్రేక్‌, స్టీల్‌ డ్రమ్‌ బ్రేక్‌ ఆప్షన్లు కలిగిన స్పెషల్‌ వేరియంట్‌లలో కూడా కంపెనీ ఈ కొత్త వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది.  దీని ధరను రూ.64,800- 69,500గా కంపెనీ నిర్ణయించింది (ఎక్స్‌ షోరూమ్‌ న్యూఢిల్లీ).  

 

స్టాండర్డ్‌ వేరియంట్‌ ధరను రూ.64,800 వద్ద, స్పెషల్‌ ఎడిషన్‌ ధరను రూ.68,500 వద్ద ప్రారంభమవుతాయని సుజుకీ తెలిపింది. భారతీయుల మది దోచుకున్న యాక్సెస్‌ వాహనం.. సుజుకీ ఎదుగుదలలో కీలక పాత్రను పోషిస్తూ వస్తోందని సంస్థ వివరించింది. యాక్సెస్‌ పనితీరు పట్ల వినియోగదారుల నుంచి ప్రశంసలు అందాయని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొయిచిరో హిరావో తెలిపారు. 

 

ఇక వీటిని నిలబెట్టుకని ముందుకు సాగే ప్రయత్నంలోనే భాగంగా బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలు కలిగిన యాక్సెస్‌-125 స్కూటర్‌ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. అలాగే ఎల్ఈడీ హెడ్ లైట్, స్పీడో మీటర్ పై ఎకో లైట్, బ్యాటరీ పరిస్థితిని తెలిపే వోల్టేజీ మీటర్‌ డిజిటల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముం దుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని ఆయ‌న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: