కొత్త బడ్జెట్ వచ్చేస్తుంది.. వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం విధితమే. ఆర్ధిక మందగమనం నేపథ్యంలో ఈ సంవత్సరం ఐయుదు శాతం వృద్ధిరేటు అంచనా వేసింది..ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ట్రెండ్ అయ్యేంత సంచలన వ్యాఖ్యలు ఏంటి అనుకుంటున్నారా ? మిరే చుడండి..  ఆనంద్ మహీంద్రా ట్విట్ చేస్తూ.. '2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5శాతం వృద్ధి రేటు అంచనాతో మనం మళ్లీ చైనా వెనకే ఉందామా? కొన్ని పకడ్బందీ చర్యలతో అదిరిపోయే బడ్జెట్‌ను ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేయండి.. నిర్మలాజీ' అంటూ ట్వీట్‌ చేసారు. 

 

చైనా 2019లో 6 నుంచి 6.5శాతం ఆర్థిక వృద్ధి రేటు చేరుకుంటుందనే బ్లూమ్‌బర్గ్‌ మీడియా ట్వీట్‌ను మహీంద్రా తన పోస్ట్‌తో కలిపి షేర్‌ చేశారు. అయితే ఈ సమయంలోనే మహీంద్రా ట్విట్ చుసిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ''సర్‌, మీరు చాలా ఎక్కువ ఊహిస్తున్నారు. కాస్త శాంతించండి.. బడ్జెట్‌ తర్వాత మీరు నిరాశకు లోనవుతారు'' అంటూ ఆ నెటిజన్ పేర్కొన్నారు. 

 

ఈ ట్విట్ చుసిన ఆనంద్ మహీంద్రా..  అతడికి తిరిగి స్పందిస్తూ..  ''నేనెప్పుడూ శాంతించడానికి ఆలోచించను.. అదేవిధంగా నేనెప్పుడూ ఆశావాదిగా ఉండటాన్ని ఆపడానికి సైతం ప్రయత్నించను'' అని నవ్వుతున్న ఎమోజీతో బదులిచ్చారు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: