టీవీఎస్ ఈమధ్య కాలంలో మార్కెటింగ్ బాగా చేస్తుంది.. కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే టీవీఎస్ ఐక్యూబ్ 'ఎలక్ట్రిక్ స్కూటర్' ను భారత్ మార్కెట్ లోకి సరికొత్తగా తీసుకొచ్చింది. అలాంటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏమి ఏం స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఈ టీవీఎస్ బైకులు మొదట కేవలం బెంగుళూరులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ బైక్ లు డోర్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి. ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కనెక్టెడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 

 

ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఇల్యుమినేటెడ్ లోగో వంటివి ఈ బైక్ లో వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఈ బండి సింగల్ పేమెంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.. కాగా ఈ స్కూటర్‌లోని కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, జియో-ఫెన్సింగ్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, న్యావిగేషన్ అసిస్ట్, ఇన్‌కమింగ్ కాల్స్/మెసేజ్‌ అలర్ట్ ఇంకా ఎన్నో ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ బండి వేగం గంటకు 78 కిలోమీటర్లు వెళ్లగలదు.. అంతేకాదు ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 75 కిలోమీటర్లు నడుస్తుంది.. అయితే ఇన్ని బాగున్నా కూడా దీని ధరనే మరి ఎక్కువగా ఉంది. ఎంత అనుకుంటున్నారా ? ఎక్స్-షోరూమ్ ధర ఏకంగా రూ. 1.15 లక్షలుగా కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ కి అంత ధర? మీకు నచ్చిందా? 

మరింత సమాచారం తెలుసుకోండి: