మర్చి 8.. మహిళలకు ఆ తేదీ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే సంవత్సరం అంత మహిళలను చీడపురుగులు చూసినట్టు చుసిన మగ మృగాలు కూడా ఆరోజు ఒక్కటి నోరు మూసుకుంటాయి. ఆరోజు ఒక్కటి మహిళను గౌరవిస్తారు.. చాలామంది మగమృగాలు అయితే.. మహిళా దినోత్సవం అయితే ఏంటి బొక్క అని కూడా అంటారు.. నిజానికి ఈ కాలంలో ఎంతోమందికి మహిళలు అంటే గౌరవం లేదు అంటే నమ్మండి. 

 

ఇకపోతే.. ఈ నేపథ్యంలోనే.. మహిళలు అంటే ఎవరికి గౌరవం ఉన్న లేకున్నా ఆ రెనాల్ట్ ఆటో సంస్ద మాత్రం మహిళలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. సాధారణంగా పండుగలకు.. లేదా ఏదైనా స్పెషల్ డేస్ కు మాత్రమే అన్ని కంపెనీలు ఆఫర్లు ఇస్తాయి.. అలానే మహిళలకు ఎంతో ప్రత్యేకమైన మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది ఈ రెనాల్ట్ ఆటో సంస్ద. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహిళల కోసం ఓ ప్రత్యేకమైన ఆఫర్ ను తీసుకువచ్చింది రెనాల్ట్ సంస్ద. అది ఏంటి అంటే? కారు యజమానులైన మహిళలందరికీ ఉచితంగా వారి వాహనాలను చెకప్ చేస్తుంది. అంతేకాదు లేబర్, స్పేర్ పార్ట్ లాంటి విలువ ఆధారిత సేవలకు 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుంది ఈ సంస్ద. దీంతో పాటు వాహనాల వారంటీని కూడా పొడిగించుకునే అవకాశాన్ని రెనాల్ట్ సంస్ద కల్పించింది.

 

వాహనాల రిపేరు చేసేందుకు, పరీక్షించేందుకు గాను రోడ్ సైడ్ అసిస్టెన్స్ నూ ఇవ్వనుందీ సంస్థ. ఇందులోనూ 10 శాతం డిస్కౌంటు ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న రెనాల్ట్ డీలర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతే కాదు ఈ ఆఫర్లు కేవలం వారం రోజుల మాత్రమే ఉంటాయి. 

 

మార్చి 2 నుండి 8వ తేదీ వరకు ఈ సేవలను రెనాల్ట్ సంస్ద అందిస్తుంది. డీలర్లు మహిళా వినియోగదారులకు కొన్ని పోటీల నిర్వహించి.. అందులో నెగ్గిన వారికి బహుమతులు కూడా ఇవ్వాలని ఈ రెనాల్ట్ సంస్ద ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: