ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా గడగడలాడిస్తోంది అంటే అది కరోనా వైరసే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచం అంత వ్యాపిస్తూ ప్రజలను వణికిస్తోంది. ఇప్పటి వరుకు దాదాపు ఈ కరోనా వైరస్ కారణంగా 4వేలమందికిపైగా మరణించారు అంటే నమ్మండి. అలాంటి ఈ వైరస్ ప్రస్తుతం భారత్ ను వణికిస్తోంది అంటే నమ్మండి. 

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ ఇతర దేశాలలో కంటే మనం భారతదేశంలోనే ఈ కరోనా వైరస్ అతివేగంగా వ్యాపిస్తుంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో మరి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

కరోనా వైరస్ ఎక్కువగా ప్రయాణాల కారణంగానే వ్యాపించడం వల్ల ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్‌లోకి ప్రవేశించే బస్సులు సర్టిఫికేట్ చూపించి లోపలి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా బయట నుండి వచ్చిన బస్సులు  కరోనా ఇన్ఫెక్షన్ నుండి శుభ్రం చెయ్యబడింది అని నిర్దారించినట్టు ఈ బస్సులు ద్రువీకరించబడాలి. 

 

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఈ సర్టిఫికేట్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉంది. అంతేకదు.. కరోనా దెబ్బకు ఆటోలు.. మినీ బస్సులు నడిపే డ్రైవర్లకు కూడా ఇప్పటికే భద్రతా సూచనలు జారీ చేశారు. ఈ వైరస్ పట్ల అవగాహన పెంచడానికి వాహనాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అని వారికీ తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: