ప్రస్తుతం ఆటోమొబైల్ పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలు ఆగిపోయిన అమ్మకాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అందుకే ఈ మూడు నెలల్లో లాంచ్ అవ్వాల్సిన కార్లు అన్ని ఒక్కోటి లాంచ్ అవుతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రముఖ వాహన సంస్థ మారుతీ సుజుకీ తన సరికొత్త సెలేరియో సీఎన్జీ వేరియంట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 

 

ఇంకా ఈ కారు ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో వచ్చేసి రూ.5.61 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ సుజికి సీఎన్జీ రెండు వేరియంట్లలో అందుబాటిలోకి వచ్చింది. ఇంకా అలానే వేరియంట్ బట్టి ధర నిర్ణయించారు. అయితే పెట్రోల్, డీజిల్ వేరియంట్లను ఇప్పటికే విపణిలో లాంచ్ చేసిన ఈ సంస్థ తాజాగా సీఎన్జీ వేరియంట్ ను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత్ మార్కెట్ల లాంచ్ చేసింది. 

 

ఇంకా ఈ కారు వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(ఓ) అనే రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. మొదటి వేరియంట్ సుజుకీ సెలేరియో వీఎక్స్ఐ ధర రూ.5.61 లక్షలుగా నిర్ణయించారు. ఇంకా రెండో వేరియంట సుజుకీ సెలేరియో వీఎక్స్ఐ (ఓ) వేరియంట్ ధర రూ.5.68 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు లాంచ్ అవ్వనున్న మారుతీ సుజుకీ సెలేరియో సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ వివరాలు ఇంకా బయట పెట్టలేదు. 

 

అయితే బీఎస్4 మోడల్ మాదిరే బీఎస్ 6 మోడల్ పవర్ ఔట్ పుట్ ఉంటుందని అంచనా వేశారు నిపుణులు. కాగా ఈ కారుకు పోటీగా హ్యుండాయ్ శాంత్రో సిద్ధంగా ఉంది. శాంత్రో సీఎన్జీ మోడల్ కూడా మ్యాగ్నా, స్పోర్ట్జ్, వేరియంట్లో లభ్యం అవుతుంది. అయితే ఈ కారు ప్రారంభ ధర 5.85 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: