మరుతి నుండి వచ్చిన స్విఫ్ట్ కారు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వెహికల్ గా మంచి క్రేజ్ సంపాదించింది. మారుతి సుజుకి కస్టమర్స్ యొక్క ప్రాధ్యాన్యతను బట్టి స్విఫ్ట్ లో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం స్విఫ్ట్ నుండి కొత్త మోడల్ రాబోతుంది. అధునాతన ఫీచర్స్ లో ఈ మోడల్ త్వరలో మార్కెట్ ను శాసించేందుకు వస్తుంది. అయితే స్విఫ్ట్ కారుని టార్గెట్ చేస్తూ ఫ్రెంచ్ ప్యాన్సిజర్ కార్ల తయారీ సంస్థ ఫ్యూజో కొత్త మోడల్ కారుని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది.


స్విఫ్ట్ కు పోటీగా ఫ్యూజో ఎస్.సి 21 కోడ్ పేరుతో 2020 కల్లా హ్యాచ్ బ్యాక్ కారుని రిలీ చేస్తుందట. ఇక ఈ వెహికల్ తో పాటుగా మరో రెండు కొత్త హ్యాట్ బ్యాక్ వెహికల్స్ రిలీజ్ చేయనుందని తెలుస్తుంది. చెన్నై హిందూస్తాన్ మోటార్ మ్యాను ఫ్యాచర్ తో డీల్ కుదుర్చుకుని ఫ్యూజో కార్లు రిలీజ్ చేయనుంది. ఫ్యూజో నుండి కొత్త 208 కారు మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. త్వరలో ఇండియన్ మార్కెట్ లోకి కూడా ఫ్యూజో తమ ఉత్పత్తులను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: