టివిఎస్ నుండి స్రికొత్త 125 సిసి స్కూటర్ మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. టెస్ట్ డ్రైవ్ లో ఉన్న ఈ స్కూటర్ విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ స్కూటర్ 2014లో ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన గ్రాఫైట్ స్కూటర్ ఆధారంగా డిజైన్ చేశారని తెలుస్తుంది. డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ తో పాటుగా డిజిటల్ డిస్ ప్లే స్పీడో మీటర్ కూడా ఈ స్కూటర్ యొక్క అధునాతనంగా వస్తున్న ఫీచర్స్. 


ఇక మార్కెట్ లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఈ స్కూటర్ ను తయారు చేశారని చెప్పొచ్చు. ఈ స్కూటర్ కేవలం 125 సిసి కెపాసిటీ గల ఇంజిన్ కోసమే కాకుండా 150 సిసి కెపాసిటీ గల ఇంజిన్ కోసం కూడా వాడేలా ఉన్నారు టివిఎస్ నిర్వాహకులు. అయితే ఆ మోడల్ లో మరికొన్ని అదనపు మార్పులు ఉంటాయని తెలుస్తుంది. 


లీక్ అయిన పిక్స్ ను బట్టి చూస్తే టివిఎస్ నుండి గ్రాండ్ గా ఈ సరికొత్త 125 సిసి స్కూటర్ రాబోతుందని అనిపిస్తుంది. మరి ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. తప్పకుండా టివిఎస్ స్కూటర్ అనుభూతిని పొందాలనుకునే వారు ఈ స్కూటర్ మీద డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: