కెటిఎం నుండి సరికొత్త హంగులతో ఆర్సి 390 ఆర్ లాంచ్ అవుతుంది. రేసింగ్ కు అనువుగా ఉండే ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్ గా కేవలం 500 యూనిట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారట. కెటిఎం నుండి ఆర్సి 390 ఆర్ వర్షన్ తో రాబోతున్న ఈ బైక్ పర్ఫార్మెన్స్ లో అదరగొడుతుందని అంటున్నారు. 373.2 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ రేసింగ్ కు పర్ఫెక్ట్ అని తెలుస్తుంది.


అయితే కేవలం 500 యూనిట్స్ మాత్రమే ఈ స్పెసిఫికేషన్స్ తో కెటిఎం ఆర్సి 390 ఆర్ రిలీజ్ అవుతుంది. ఇక దీనితో పాటుగా ఎసెస్పి 300 రేస్ కిట్ కూడా అదనంగా ఇస్తున్నారు. అయితే బైక్ తో పాటుగా అది కూడా కొనాలంటే అదనపు ధర ఉంటుంది. ప్రస్తుతం కెటిఎం ఆర్సి 390 ఆర్ ప్రైజ్ 7.65 లక్షలు కాగా.. ఎస్సెపి కిట్ తో రేస్ కిట్ తో కలిపి 9.91 లక్షలుగా నిర్ణయించారట.


కెటిఎం నుండి ప్రెస్టిజియస్ గా వస్తున్న ఈ బైక్ కచ్చితంగా కెటిఎం బైక్ అభిమానులను నచ్చి తీరుతుందని అంటున్నారు. రేసింగ్ కు అనువుగా అధునాతన టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్ మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం 500 యూనిట్స్ లో ఆ బైక్ మీ సొంతం కూడా కావాలంటే దగ్గరలో ఉన్న కెటిఎం షోరూంను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: