రాయల్ ఎన్ఫీల్డ్ నుండి వచ్చిన హిమాలయ మోడల్ 2018 జనవరిలో కేవలం 500 యూనిట్స్ మాత్రం అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఆన్ లైన్ బుకింగ్ లో కూడా ఉంచడం జరిగింది. ఇక ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి హిమాలయ స్లిట్ ఎడిషన్ ను రిలీజ్ చేస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్. ఈ మోడల్స్ దేశంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్స్ అందరికి అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.


1.71 లక్షల ప్రారంభ ధర కలిగిన ఈ ఎన్ఫీల్డ్ మోడల్ స్లిట్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ తో వస్తుంది. ధర కాకుండా ఇతర యాక్సెసరీస్ 31వేల దాకా ఉంటుందని తెలుస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ స్లిట్ ఎడిషన్ లో కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే జరిగాయని తెలుస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఎక్స్ టీరియర్ పెయింట్ స్టైల్ హిమాలయ పర్వాతాలను ప్రతిభింభిస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: