సుజుకి నుండి సరికొత్త మోడల్ జి.ఎస్.ఎక్స్ ఎస్-750 మోడల్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. 750 సిసి కెపాసిటీ కలిగిన ఈ బైక్ ధర 7.45 లక్షలుగా నిర్ణయించబడింది. లక్సరీ బైక్ గా వస్తున్న ఈ మోడల్ 2018 లో సుజుకి నుండి వస్తున్న ప్యాషనేట్ వెహికల్ అని చెప్పొచ్చు. 


ఈ సుజుకి జి.ఎస్.ఎక్స్ ఎస్-750 విడిభాగాలను ఇంపోర్ట్ చేసుకుని తయారు చేయబడిన బైక్ ఇది. మే 2018 నుండి ఈ బైకులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రెండు విభిన్నమైన కలర్స్ లో ఈ బైక్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ బైక్ సుజుకి జి.ఎస్.ఎక్స్ ఎస్-1000 బైక్ ను పోలి ఉన్నా ఆ బైక్ కు దీనికి కొద్ది మార్పులు ఉన్నాయి.  


110 బి.హెచ్.పి సామర్ధ్యంతో 81 ఎన్.ఎం టార్క్ పవర్ తో ఈ బైక్ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ సరికొత్త సుజుకి జి.ఎస్.ఎక్స్ ఎస్-750 సుజుకి కస్టమర్స్ ను సాటిస్ఫై చేస్తుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: