భారతదేశ మోటార్ రంగంలో మారుతి బ్రాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కస్టమర్స్ యొక్క ప్రాధాన్యతను బట్టి కొత్త మోడల్స్ తో పాటుగా సరికొత్త అప్డేట్స్ తో మారుతి తమ వెహికల్స్ రిలీజ్ చేస్తుంది. అందుకే ఏ మోటార్ కంపెనీ సాధించలేని విజయాలని సాధిస్తుంది. ఇక అసలు విషయంలోకి వస్తే మారుతి నుండి ఎస్.యు.వి మోడల్ లో వచ్చిన వితారా బ్రిజా రికార్డ్ సేల్స్ సాధించింది.


2016లొ రిలీజ్ అయిన ఈ మోడల్ 2018 ఏప్రిల్ నాటికి అత్యధికంగా 2.75 లక్షల యూనిట్స్ సేల్ అవడం జరిగింది. మొదట ఈ వెహికల్స్ డీజిల్ ఇంజిన్, మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ తో వచ్చాయి. ఇక మారుతున్న కాలానుగుణంగా అవి అప్డేట్ అవుతూ డీజిల్ తో పాటు పెట్రోల్ వెహికల్ ఇక ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ ఎవైలబిలిటీ వచ్చింది.


మారుతి వితారా బ్రిజా నుండి ఎస్.యు.వి మోడల్స్ లో విడిఐ, జడ్.డి.ఐ, జెడ్.డి.ఐ ప్లస్ వేరియెంట్స్ రిలీజ్ అయ్యాయి. వీటి ధరలు చూస్తే 8.54 లక్షలు, 9.32 లక్షలు, 10.49 టాప్ ఎండ్ వేరియెంట్ ధర నిర్ణయించబడింది. ఈ టాప్ ఎండ్ వేరియెంట్లే అమ్ముడైన సేల్స్ లో 56 శాతం ఉన్నాయని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: