టివిఎస్ మోటార్ నుండి వచ్చిన టివిఎస్ స్పోర్ట్ మంచి మైలేజ్ బైక్ గా కస్టమర్స్ నుండి మెప్పు పొందింది. టివిఎస్ స్పొర్ట్ 20 లక్షల యూనిట్లు అమ్ముడైన సందర్భంగా టివిఎస్ స్పోర్ట్ నుండి అల్లాయి వీల్స్ ఎడిషన్ రిలీజ్ చేశారు. ఇక దీనిలో కిక్ స్టార్ట్ వేరియెంట్ అయితే 44, 961 రూపాయల ధర నిర్ణయించారు.


ఇక ఎలెక్ట్రిక్ స్టార్ట్ వెహికల్ అయితే 46,257 రూపాయల ధర నిర్ణయించారు. కొత్తగా వచ్చిన ఈ టివిఎస్ స్పోర్ట్ ఎడిషన్ విభిన్న రంగుల్లో రిలీజ్ అవుతుంది. స్పెషల్ గా అల్లాయి వీల్స్ బ్లాక్ కు బదులుగా వైట్ అల్లాయి వీల్స్ ను రిలీజ్ చేస్తుంది. కేవలం ఈ ఒక్క మార్పు తప్ప మిగతా విషయాల్లో ఎలాంటి మార్పు పొందలేదు.


99.7 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ సింగిల్ సిలిండర్ డ్యూరా లైఫ్ ఇంజిన్ అందుబాటులో ఉంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటుగా 7.3 బిహెచ్పి పవర్ ఇంకా 7.5 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 95 కిలోమీటర్ మైలేజ్ సామర్ధ్యంతో ఈ బైక్ వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: