సుజుకి నుండి మార్కెట్ లోకి ఓ కొత్త బైక్ రిలీజ్ అవుతుంది. సుజుకి జిక్సర్ 155 సిసి కెపాసిటీ గల ఇంజిన్ తో ఈ మోడల్ రిలీజ్ అవబోతుంది. సుజుకి నుండి వచ్చిన ఈ బైక్ యాంటీ లా బ్రేకింగ్ సిస్టెం తో వస్తుంది. ఇక దీని ధర 87,250 రూపాయల ఎక్స్ షూరూం ప్రైజ్ తో వస్తుంది.   


155 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పాటుగా 8000 ఆర్పిఎం వద్ద 14.8 హెచ్పి సామర్ధ్యం. 6000 ఆర్పిఎం వద్ద 14 ఎన్.ఎం టార్క్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటుగా సుజుకి జెట్ కూలింగ్ సిస్టెం తో ఈ బైక్ వస్తుంది. మార్కెట్ లో కొత్త మోడల్స్ ఎన్ని ఉన్నా సుజుకి నుండి వస్తున్న ఈ బైక్ ప్రత్యేకమైందనిగా చెప్పొచ్చు.  


సుజుకి నుండి మరిన్ని కొత్త మోడల్స్ ఈ ఇయర్ మార్కెట్ లోకి రానున్నాయి. హీరో, హోండా, బజాజ్, టివిఎస్ బైకులకు పోటీగా సుజుకి తమ ఉత్పత్తులను తయారుచేస్తుంది. మరి ఈ సరికొత్త జిక్సర్ 155 సిసి ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: