బుల్లెట్ బైకులకు ఉండే క్రేజ్ వేరే.. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ రిలీజ్ చేయకముందే 1960 కాలంలో జావా బైక్స్ బాగా పాపులర్ అయ్యాయి. యూరప్ నుండి ఎక్స్ పోర్ట్ అయ్యి ఆరోజుల్లోనే అందరి మనసులు గెచిన బైక్ జావా. ఐడియల్ జావా పేరుతో ఇండియాలో కూడా భారీ సేల్స్ సాధించింది జావా. 


60 లో రిలీజ్ అయినా 1980 వరకు ఇండియాలో కూడా జావా బైక్స్ బాగా సేల్ అయ్యాయి. ఆ తర్వాత యమహా, హీరో హోండా బైకుల మీద దృష్టి పెట్టిన కస్టమర్స్ జావాని పట్టించుకోవడం మానేశారు. సేల్స్ తగ్గుముఖం పట్టడంతో బైకులు కూడ ఆపేశారు.  


అయితే మళ్లీ ఈ జావా బైక్స్ ఇండియన్ రోడ్ల మీద తిరగనున్నాయి. ఈ జావా బైకులను అధునాతన టెక్నాలజీతో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 300 సిసి కేపాసిటీతో ఈ బైకులు వస్తున్నాయి. ప్రస్తుతం యువత బైకుల మీద మంచి మోజు ఏర్పరచుకున్నారు. తప్పకుండా జావా బైకులు మళ్లీ ఒకప్పటిలా మంచి సేల్స్ సాధిస్తాయని చెప్పొచ్చు. 2018 దీపావళికి ఈ బైక్స్ ఇండియ రోడ్ల మీద తిరగనున్నాయి.      


మరింత సమాచారం తెలుసుకోండి: