హోండా నుండి స్కూటర్ విభాగంలో సరికొత్త ఏవియేటర్ రిలీజ్ అయ్యింది. హోండా యాక్టివా ఐ రిలీజ్ అయిన వెంటనే కొత్త హోండా ఏవియేటర్ ను రిలీజ్ చేశారు. ఇక దీని ధర 55,157 రూ.లుగా నిర్ణయించబడింది. ఇదవరకు మోడల్ కన్నా హోండా ఏవియేటర్ ధర లో కూడా 1,400 ఎక్కువ రేటు కలిగి ఉంది.


యాక్టివా 125 స్కూటర్ తరహాలోనే ఈ ఏవియేటర్ ఉంటుంది. ఎల్.ఈ.డి హెడ్ ల్యాంప్, డే టైం కూడా వెలిగే ఎల్.ఈ.డి లైట్స్, 4 ఇన్ 1 ఇగ్నిషన్ స్విచ్ కూడా ఉంది. 109 సిసి కెపాసిటీ కలిగిన ఈ ఏవియేటర్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇక 8 బెహెచ్పి పవర్, 9 ఎన్.ఎం టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది.


ఈ సరికొత్త ఏవియేటర్ మూడు కొత్త కలర్స్ తో వస్తుంది. హోండా నుండి వచ్చిన ప్రతి స్కూటర్ బెస్ట్ మైలేజ్ అందిస్తుంటాయి. ఏవియేటర్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. మరి స్కూటర్ తీసుకునే ఆలోచన ఉన్న వారు ఈ సరికొత్త హోండా ఏవియేటర్ పై ఓసారి లుక్ వేయండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: