హీరో మోటార్స్ నుండి 125 సిసి కెపాసిటీతో సరికొత్త డ్యుయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతుంది. 125 ఐ3ఎస్ స్కూటర్ టీజర్ ను రిలీజ్ చేశారు హీరో మోటార్స్. 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనలో ఉంచిన ఈ డ్యుయెట్ ఐ3ఎస్ స్కూటర్ చూపరులను ఆకట్టుకుంది.


డ్యుయెట్ 110 సిసి కెపాసిటీ స్కూటర్ ను పోలి ఉండే ఈ హీరో డ్యుయెట్ 125సిసి ఐ3ఎస్ స్కూటర్ మరి కొంత టెక్నికల్ అప్డేట్స్ తో వస్తుంది. 8.7 బి.హెచ్.పి పవర్, 10.2 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేసే సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో ఈ స్కూటర్ వస్తుంది.   


దీని స్పెషాలిటీస్ లో ప్రత్యేకమైనది ఇంజిన్ ఎక్కువ సేపు ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. వెంటనే రైజ్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అయ్యి దూసుకెళ్తుంది. అధిక మైలేజ్ సాధ్యమయ్యే ఈ స్కూటర్ 58,000 రూ.ల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తుంది. మరి సరికొత్త డ్యుయెట్ 125 ఐ3ఎస్ అనుభూతిని పొందాలనుకునే వారు దీని గురించి మరిన్ని వివరాలు దగ్గరలో ఉన్న షోరూం కు వెళ్లి తెలుసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: