టూ వీలర్స్ లో బెస్ట్ మైలేజ్ బైకులుగా పేరు తెచ్చుకున్నది హీరో బైకులే.. హీరో స్ప్లెండర్, స్ప్లెండర్ ప్లస్, ఫ్యాషన్ బైకులు హీరో కస్టమర్స్ కు మంచి మైలేజ్ తో పాటుగా ప్రయాణపు సౌకర్యాన్ని ఇస్తున్నాయి. ఇక హీరోకి పోటీగా టివిఎస్ కూడా అదే తరహా బైక్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. 


టివిఎస్ నుండి రాబోతున్న కొత్త బైక్ రేడియన్. టివిఎస్ విక్టర్, విక్టర్ జి.ఎల్ మోడల్స్ ను తలపించేలా మంచి మైలేజ్ అండ్ కంఫర్ట్ బైక్ గా ఇది వస్తుంది. 110 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ కచ్చితంగా మార్కెట్ లో టివిఎస్ బైక్ సేల్స్ రేటుని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.


4 గేర్ స్పీడ్ బాక్స్ తో పాటుగా 9.5 బి.హెచ్.పి పవర్, 9.4 ఎన్.ఎం టార్క్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముందు డిస్క్ బ్రేక్ సిస్టెంతో వస్తున్న ఈ బైక్ టివిఎస్ రేడియన్ సేల్స్ లో ఎలాంటి పికప్ సాధిస్తుందో చూడాలి.       



మరింత సమాచారం తెలుసుకోండి: