టివిఎస్ జుపిటర్ ఇప్పటికే వాహన ప్రియులకు మెచ్చిన స్కూటర్ గా మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఇప్పుడు సరికొత్త మోడల్ తో టివిఎస్ జుపిటర్ మార్కెట్ లోకి వస్తుంది. టివిఎస్ జుపిటర్ ఒకటి డ్రం బ్రేక్ సిస్టం తో వస్తుండగా.. డిస్క్ బ్రేక్ వర్షన్ తో మరో మోడల్ వస్తుంది. రెండు కొత్త మోడల్స్ తో టివిఎస్ జుపిటర్ కొత్త ఆవిష్కరణలు తెస్తుంది.


టివిఎస్ గ్రాండీ ఎడిషన్ గా వచ్చిన ఈ స్కూటీలు రెండు కొత్త వేరియంట్స్ కు రెండు రకాల ధర కలిగి ఉంది. డ్రం బ్రేక్ 55, 936గా నిర్ణయించగా. డిస్క్ బ్రేక్ 59,648 గా నిర్ణయించబడింది. 109 సిసి కెపాసిటీతో రానున్న ఈ బైక్ కొత్త మోడల్ మాత్రమే కాదు కొత్త కలర్స్ తో వస్తుంది. 


8 బి.హెచ్.పి పవర్, 8 ఎన్.ఎం టార్క్ కలిగిన ఇంజిన్ ఈ స్కూటర్ కలిగి ఉంటుంది. త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ కాబోతున్న ఈ టివిఎస్ జుపిటర్ మోడల్స్ కొనాలనుకునే వారు ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ చేసిన రెండు వారాల్లో డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: