బజాజ్ మోటార్స్ ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ మెటల్ తో వచ్చిన బైక్ బజాజ్ వి15. 150 సిసి కెపాసిటీతో వచ్చిన ఈ బైక్ అతి తక్కువ సేల్ రిపోర్ట్ కలిగి ఉంది. 2018లో కేవలం 30,00 బైకులు మాత్రమే అమ్ముడవగా ఇక నుండి ఈ బైకులను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. బజాజ్ నుండి వచ్చే అన్ని బైకులకు మంచి సేల్స్ కలిగి ఉంటాయి.


కాని వి15 బైకులు మాత్రం మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే వి15తో పాటుగా వి12 బైక్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. కాని వి15తో పోల్చితే వి12 సేల్స్ కాస్త బెటర్ గా ఉన్నాయి. అందుకే వి15 బైక్ ను నిలిపివేస్తున్నారు. బజాజ్ మోటార్స్ నుండి వచ్చే పల్సర్ అన్ని వేరియంట్స్ లో మంచి సేల్స్ కలిగి ఉన్నాయి.


అయితే బజాజ్ వి15 ఎందుకో సేల్స్ లో వెనుకపడింది. దానిపై కస్టమర్స్ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ మెటల్ అన్న విషయం తప్ప మిగతావన్ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఈమధ్య కాలంలో బజాజ్ నిలిపి వేసిన బైక్ వి15 మాత్రమే.. మరి త్వరలో దీని ప్లేస్ లో కొత్త బైక్ ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: