హోండా నుండి వచ్చిన సిడి 110 డ్రీం కు కొత్తగా సిబిఎస్ సిస్టెం యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక దీని ధర విషయానికొస్తే 50,028 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. హోండా డ్రీం కంబైనెడ్ బ్రేకింగ్ సిస్టెంతో అందుబాటులోకి వస్తుంది.నాన్ సిబిఎస్ డ్రీం వెహికల్ కు కేవలం 878 రూపాయల అధికంగా ఈ బైక్ వస్తుంది.  


109 సిసి కెపాసిటీతో, సిగిల్ సిలిండర్ ఇంజిన్, ఎయిర్ కూల్డ్ సిస్టెంతో వస్తుంది. 8.31 బి.హెచ్.పి పవర్.. 9.09 ఎన్.ఎం టార్క్ తో హోండా సిడి 110 డ్రీం సిబిఎస్ బైక్ వస్తుంది. 18 ఇంచ్ అల్లాయి వీల్స్ తో వస్తున్న ఈ బైక్ 80/100 సెక్షన్ ట్యూబ్ లెస్ టైర్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి. 


ఈ బైక్ బజాజ్ ప్లాటినా సిబిఎస్, టివిఎస్ రేడియాన్, హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 110, టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ తో పోటీ పడుతుంది. మరి హోండా నుండి వస్తున్న ఈ సరికొత్త సిడి 110 డ్రీం సిబిఎస్ బైక్ హోండా సేల్స్ ను పెంచుతుందేమో చూడాలి.     


మరింత సమాచారం తెలుసుకోండి: