ప్రముఖ మోటార్ కంపెనీ యాప్రిలియా నుండి యాప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ త్వరలో ఇండియాలో రిలీజ్ కాబోతుంది. ఇండియాలో ఈమధ్య బైకుల కన్నా స్కూటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. అందుకే అన్ని మోటార్ కంపెనీలు ప్రత్యేకమైన స్కూటర్ విభాగం మీద దృష్టి పెట్టారి. ఇప్పటికే మార్కెట్ లో రకరకాల స్కూటర్స్ ఉన్నాయి.


వాటిని మించేలా యాప్రిలియా స్టార్మ్ 125 వస్తుంది. టూ కలర్ వేరియెంట్స్ తో వస్తున్న యాప్రిలియా స్టార్మ్ ఎస్.ఆర్ 125 కన్నా 8000 ల తక్కువ ప్రైజ్ తో వస్తుంది. ఇక ఈ స్కూటర్ యొక్క ధర 65000 ల దాకా ఉండొచ్చని తెలుస్తుంది. 125 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ 9.5 బి.హెచ్.పి, 9.9 ఎన్.ఎం టార్క్ పవర్ తో అందుబాటులో ఉంది. 


స్కూటర్ విభాగంలో డ్రం బ్రేక్ సిస్టెం కలిగి ఉండటం యాప్రిలియా స్టార్మ్ యొక్క ప్రాధాన్య అని చెప్పొచ్చు. ఎస్.ఆర్ 125 తో పోల్చితే వీల్స్, బైక్ సెటప్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఇక ఈ స్కూటర్ హోండా యాక్టివా, టివిఎస్ ఎన్టార్క్ స్కూటర్ కు గట్టి పోటీ ఇస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: