జుట్టు తెల్లబడటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ, డానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి ఉండవు. కానీ యుక్త వయసులో ఉన్న సమయంలో జుట్టు తెల్లబడుతోంది అంటే తప్పకుండా మీలో విటమిన్స్ లోపం ఏర్పడుతోందని గ్రహించండి. అందుకు గల కారణాలు ఏవైనా అయ్యి ఉండచ్చు కానీ జుట్టు తెల్లబడకుండా ఆపడమే ప్రధాన లక్ష్యం. అయితే జుట్టు యుక్త వయసులో ఉన్నప్పుడే తెల్లబడుతోంది అంటే డానికి ముఖ్య కారణం B12 విటమిన్.  మరి తెల్ల జుట్టుతో బయటకి వెళ్తే ఎదురయ్యే కామెంట్స్, అవమానాలు అంతా ఇంతా కావు. ప్రత్యేకించి అనకపోయినా వారు ఎదుటివాళ్ళు చూసే చూపులకే మనకి గంపెడు దుఖం వచ్చి పడుతుంది. అందుకే మన శరీర సంరక్షణ ఎలా చేస్తామో జుట్టు సంరక్షణ కూడా అలానే చేసుకోవాలి.

 

జుట్టు క్రింది ఉండే  చర్మంలోని క్రింది భాగంలో మెలినిన్ ఉంటుంది. ఇది జుట్టుని తెల్లబడకుండా నల్లగా ఉండేలా చేస్తుంది. వయసు మీద పదేకొద్ది ఇది తగ్గిపోవడంతో జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ మెలినిన్ యుక్త వయసులో ఉన్నప్పుడే అయ్యిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి.  తల్లి తండ్రులకి వారి యుక్త వయసులోనే తొందరగా తెల్ల జుట్టు వస్తే పిల్లలకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది పూర్తిగా జన్యువులు మీద ఆధారపడి ఉంటుంది.

 

అలాగే నిద్ర సరిగా లేకపోవడం, హై బీపీ, పోషక ఆహరం లేకపోవడం వంటి పరిస్థితిలు సైతం జుట్టులోని మెలినిన్ స్థాయిని తగ్గిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతున్నా సరే జుట్టు తొందరగా తెల్లబడుతుంది.ముఖ్యంగా B12 విటమిన్ శరీరంలో తగ్గిపోతే ఈ తెల్లజుట్టు వస్తుంది. ప్రధాన కారణం ముఖ్యంగా ఇదే అవుతుంది. అలాగే స్మోకింగ్ ఎక్కువగా చేసే వారికి కూడా జుట్టు తెల్లబడుతుంది.

 

అయితే జుట్టులో మెలినిన్ ఉత్పత్తి పెరగడానికి మీరు ముఖ్యంగా పాటించాల్సింది. ఆహార నియమాలు అలాగే జుట్టు పోషణ. క్యారెట్, నల్ల నువ్వులు, ఉసిరి, వాల్ నట్స్ పప్పులు ఎక్కువగా తినడం వలన మెలినిన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే నువ్వుల నూనెలో మెంతుల పౌడర్ ని కలిపి తలకి మసాజ్ చేయడం ద్వారా కూడా జుట్టు చక్కగా నల్లగా మారుతుంది. ఇది ప్రయోగాత్మకంగా నిరూపించబడిందని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: