అందమైన పెదవులు... అందరి దృష్టిని మనవైపుకు లాగుతాయి. అందమైన పెదాలకి, చక్కని చిరునవ్వు తోడైతే... ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పెదాల కోసం పుట్టిన అలంకారమే లిప్ స్టిక్.  సాధార‌ణంగా కొంతమంది అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. మీకు నచ్చిన మేకప్ వస్తువు ఏంటి? అనడిగితే.. ఎక్కువ మంది లిప్ స్టిక్‌ అనే చెబుతారు. అయితే వివిధ ఆకారాలలో పెదవులను కలిగి ఉంటాయి. ఏ రకమైన పెదవులకు, ఏ రకమైన రంగుని అప్లై చేయడం వల్ల ఎంత‌ ఆకర్షణీయంగా కనబ‌డుతుందో తప్పకుండా తెలుసుకోవాలి. ఇదిలా ఉంటే.. మ‌నం లిప్ స్టిక్‌లో ఎంచుకునే రంగు బట్టీ వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటున్నారు నిపుణులు.

 

మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ రంగు..ఈ రంగు లిప్ స్టిక్ కి వేసుకోవడానికి ఆసక్తి చూపే అమ్మాయిలు చాలా దయగల హృదయం గలవారై ఉంటారుట. అందరితో కలివిడిగా కలిసిపోతారుట. మ‌రియు ఎరుపు రంగు.. ఎర్రని పెదాల్ని ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎక్కువగా ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకునే మహిళలు చాలా ధైర్యంగా, శక్తివంతంగా, లిబరల్‌గా ఉంటారని చెబుతున్నారు  నిపుణులు. అదే విధంగా వీరు రొమాంటిక్ గా కూడా ఉంటారుట.

 

ఇక బ్రౌన్ రంగు.. బ్రైన్ లిప్ స్టిక్ ని వేసుకునేవాళ్లు ఎక్కువగానే ఉంటారు. అలాంటి వాళ్లు ఒకంతట ఎవరికీ అర్థం కాని వ్యక్తిత్వాలని కలిగి ఉండే అవకాశం ఉంది. చాలా డిఫరెంట్ గా అనిపిస్తారు. నలుపు.. పేజ్ 3 పార్టీల్లో గమనిస్తే నలుపు షేడ్ వేసుకున్నవాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు చాలా మొండిగా ఉంటారు. వారితో మాట్లాడడం చాలా కష్టం. వీళ్ల‌తో కాస్త జాగ్ర‌త్త‌గానే ఉండాలి. ఇక ఎంచుకునే రంగూ, వేసుకునే విధానం తెలిసినప్పుడే లిప్ స్టిక్‌ను మనం బాగా ఉపయోగించుకోగలుగుతాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: