అందంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అయితే అందం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు, డ్రై, ఆయిలీ, జిడ్డు చర్మం వంటి చర్మ రకం మరియు మొటిమలు, మచ్చలు ఇలా అన్నీ ముఖ్యమైనవి. ఇలాంటి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను తొలిగించి అందాన్ని పెంచడంలో  ప‌సుపు మ‌రియు పెరుగు ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మానవుని జీవితాలకు పసుపు ఎన్నోవిధాల రక్షణనిస్తుంది. భారతదేశంలో పసుపుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏవైనా పెళ్లి, పేరంటా లు శుభకార్యాలు చేసినా ముందు పసుపుతోనే మొదలుపెడతాం. 

 

అయితే ప‌సుపు చ‌ర్మ సంద‌ర్యానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు పెరుగు చర్మ ఆరోగ్యంను మరియు అందంను మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇక ఈ రెండిటి క‌ల‌యిక‌తో ఎన్నో చ‌ర్మ సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముందుగా పెరుగులో కొద్దిగా పసుపు పొడి వేసి కలిపి మీ చర్మపై లేపనంగా రాయాలి. ఇది మీ చర్మ రంగును పెంచడంలో గొప్పగా పనిచేస్తుంది. పసుపు, పెరుగు , శెనగపిండి, క‌లిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. అన్ని రకాల చర్మ చీకాకుల నుండి మిమ్మల్ని విముక్తి ల‌భిస్తుంది.

 

అలాగే పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పెరుగు మంచి క్లీనింగ్ ఏజెంట్. ఈ రెండు పదార్థాలు కలిపి ప్యాక్ వేసుకుంటే, ఎలాంటి చర్మ వ్యాధులనైనా నయం చేయవచ్చు. ముఖ్యంగా మొటిమలు వంటి సమస్యలకు ఇది గ్రేట్‌గా ప‌ని చేస్తుంది. అదే విధంగా.. ముఖంపై ముడతలను తొలగించడానికి ఇది గొప్ప మార్గం. కొల్లాజెన్ ఉత్పత్తికి పెరుగు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను తేమ చేయడానికి కూడా ఉపయోగపడతాయి.  

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: