అధిక బరువుతో ఎంతో మంది మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళు బయటకి వెళ్ళాలంటేనే అందరూ తమని చూసి నవ్వుకుంటారో, గేలి చేస్తారో అనుకుని మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు. అలాగే  ఎక్కడికి వెళ్ళాలన్నా శరీరం సహకరించాడు. చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతారు రెండు అడుగులు వేస్తేనే ఆయాసంతో రొప్పుతూ ఉంటారు. ఇలాంటి అదక బరువు  ఫాస్ట్ ఫుడ్స్ వలన రావచ్చు, జన్యు పరమైన మార్పులవలన కూడా రావచ్చు. అయితే ఎలా స్థూలకాయం వచ్చినా సరే దాన్ని ఇట్టే  కరిగించే శక్తి అల్లం కి ఉందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

 

నిమ్మరసంలో కాస్తంత అల్లం కలుపుకుని తింటే సులభంగా బరువు తగ్గుతాం.ఇది శరీరంలో కొవ్వుని మెల్ల మెల్లగా హోమియోపతి మెడిసిన్ లా కరిగిస్తుంది. అందరికి తెలిసిన విషయమే గ్రీన్ టీ బరువుని తగ్గిస్తుందని, ప్రతీ రోజు గ్రీన్ టీ త్రాగడం కూడా ఏంతో మంచిది కాబట్టి గ్రీన్ టీ త్రాగే వాళ్ళు అందులో కొంచం నిమ్మరసం, అల్లం రసం కలిపి త్రాగితే మంచి ఫలితాలని ఇస్తుంది.

 

అల్లం రసంలో తేనే, నిమ్మరసం కలిపి త్రాగితే అసలు డీ హైడ్రేషన్ సమస్య రాదు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో పెరిగి శరీరాన్ని కాపాడుతాయి. అయితే మీరు అల్లం నిమ్మరసం కలిపి ఎలా తీసుకున్నా సరే అధికంగా ఆకలి వేసే పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: