సాధారణంగా పల్లెల్లో అయితే ఇంటి ముందు ఎన్ని ఉంటాయో.. అవే పట్టణాల్లో దొరకాలంటే జెల్ రూపంలో దొరుకుతాయి. మన పల్లెల్లో ఫ్రీగా దొరికే ఈ కలబంద మనం పట్టణాల్లో రేటు పెట్టి కొంటాం. ఎందుకు? ఈ కలబందతో చాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి. ఆ ఉపయోగాలు ఏంటి అనుకుంటున్నారా ? 

 

అదేనండి.. మనం కొత్తగా కట్టిన ఇళ్లకూ, భవంతులకూ దృష్టి దోష నివారణ కోసం కడుతుంటం. ఒక చిన్న మొక్కను తెచ్చి పెరట్లో నాటి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తుంటే చాలు. ఈ మొక్క ఎన్నో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. వేర్ల నుంచే మళ్లీ దీనికి మొక్కలు వస్తాయి. అయితే ఈ అలోవెరా అందాన్ని.. ఆరోగ్యాన్ని రెండింటిని ఇస్తాయి. అయితే అది ఎలా వాడాలో ఇక్కడ చదివి తెలుసుకొండి. 

 

చర్మం నల్లబారకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కలబందను ఎంచుకోవాలి. కలబంద గుజ్జులో..  చెంచా నిమ్మరసం కలిపి మెడ, ముఖం, మోచేతుల మీద అప్లై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత అది అంత కడిగేసుకోవాలి.

 

కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, చెంచా తేనె, పాలమీగడ, రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఈ ప్యాక్‌ పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అంతే చర్మం నిగారింపుతో మెరిసిపోతుంది. 

 

4 కలబంద గుజ్జులో కీరదోస రసం, పెరుగు, రోజ్‌ వాటర్‌ కలిపి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: