అందంగా క‌నిపించాల‌ని కోరుకోని వారుండ‌రు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్టీఫీషియల్ మెరుపులు అద్దుతుంటారు. కాని, ఇవి మ‌న‌కు తాత్కాలిక ప‌రిష్కారాన్ని మాత్ర‌మే అందిస్తాయి. ముఖ్యంగా మాయిశ్చరైజర్లు, బాడీ క్రీమ్‌లు, హెయిర్‌ కండిషనర్లు, డీప్‌ క్లీనర్లతో చేకూరే అందం ఎప్పుడూ శాశ్వ‌తం కాదు. అలా కాకుండా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీసొంతమవుతుంది. ఇక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేకుండా నిత్యం చలాకీగా కనపడ్డం ఆరోగ్యంగా ఉన్నామనడానికి సంకేతం. అలా ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ అందంగానే కనపడతారన్నది నిఫుణుల మాట.

 

అయితే స్కిన్ అందంగా మెరిసిపోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ఆహార జాగ్ర‌త్త‌లు పాటించాలి. అందులో ముందుగా పెరుగు. ఇది తీసుకున్నా, పూసుకున్నా ఎన్నో సౌంద‌ర్య లాభాలు పొందొచ్చు. పెరుగులో ఉండే మంచి బాక్టీరియం వృద్ధాప్య ప్రక్రియను ఆపడానికి సహాయపడుతుంది మరియు మొటిమలు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అందుకే ఖ‌చ్చితంగా మ‌న రోజువారి డైట్‌లో ఓ క‌ప్పు పెరుగును కూడా చేర్చాలి. అలాగే చర్మం ఆరోగ్యంగా, యవ్వనవంతంగా, కాంతులీనాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చాలి. ఇందుకోసం ఆలివ్‌ ఆయిల్‌, కొబ్బరి, గ్రాస్‌ ఫెడ్‌ బటర్‌, అవొకాడో, నట్స్‌ తినాలి. దానిమ్మ, బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

 

వీటిని తినటం వల్ల చర్మం సాగే గుణాన్ని సంతరించుకుంటుంది కాబట్టి ముడతలు ఏర్పడవు. అదేవిధంగా, చేప‌లు. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట, ముడతలు, మొటిమలతో పోరాడతాయి. మరియు, ఇది చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక బొప్పాయి లో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్ మన చర్మానికి ఆరోగ్యకరమైన గ్లో ఇస్తుంది. అందుకే బోప్పాయిను కూడా డైట్‌లో చేర్చుకోవ‌డం చాలా మంచిది. మ‌రియు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తామర, సోరియాసిస్ తో పోరాడటానికి, మొటిమల మచ్చలను తగ్గించడానికి తోడ్పడతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: