సాధార‌ణంగా మ‌న న‌వ్వు అందంగా ఉండాలంటే.. దంతాలు, వాటితో పాటు చిగుళ్లు కూడా అందంగా, బ‌లంగా ఉండాలి. అంటే దంతాల వలే చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దృడంగా, క్లీన్ గా మరియు పింక్ కలర్లో ఉండాలి. కానీ, చాలా మంది చిగుళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్త స్రావం తద్వారా దంతాలు వదులు అవ్వడం మొదలగు లక్షణాలు దంత సమస్యలో ఒక భాగం. ఒక్కోసారి ప్రాణం పోతుందా.. అన్నంత బాధని కలిగిస్తాయి. ఈ సమస్యలు చాలా రకాలున్నాయి. అవి కొన్ని స్వల్పకాలికమైనవైతే, మరికొన్ని దీర్ఘకాలికమైనవి. 

 

వీటిలో కొన్ని తగిన పరిశుభ్రత పాటించక పోవడం వల్ల వస్తే.. మరికొన్ని మ‌న నిర్లక్ష్యం వల్ల వస్తాయి. అయితే ఎటువంటి చిగుళ్లు స‌మ‌స్య‌లైనా త‌రిమికొట్టి.. అంద‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన చిగుళ్లు పొందాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అందులో ముందుగా..  ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి కలపండి. రోజుకి మూడుసార్లు ఈ నీటితో పుక్కిలించండి. ఇలా చేయ‌డం వ‌ల్ల.. ఉప్పులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-సెప్టిక్ గుణాలు చిగుళ్ల వాపు తగ్గిస్తుంది.

 

అలాగే దంతాలకు బ్రష్ చేసి, నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత దంతాలకు, చిగుళ్ళకు పసుపు రాయండి.  ప‌ది నిముషాలు అలాగే ఉంచి.. ఆ త‌ర్వాత నార్మల్ వాటర్ ను నోట్లో పోసి బాగా పుక్కిలించి ఊసేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి చిగుళ్ల స‌మ‌స్య అయినా త‌గ్గిపోతుంది. అదేవిధంగా, తేనె చిగురు దగ్గర ప్లేక్ ఏర్పడకుండా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెని చిగుళ్ళ మీద మృదువుగా మర్దనా చెయ్యండి. ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ ని చిగుళ్ళ మీద నెమ్మదిగా మర్దనా చెయ్యండి. అలా కొన్ని నిమిషాలుంచిన తరవాత నోరు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల చిగుళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గి.. అందంగా, ఆరోగ్యంగా మార‌తాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: