సాధార‌ణంగా తాము అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని కోరుకునే వారు ఎక్కువగా ముఖంమీదే శ్రద్ధ చూపుతారు. చేతుల గురించి అస్సలు పట్టించుకోరు. వాస్త‌వానికి మానవ శరీరంలో ముఖం తర్వాత అందంగా కనిపించేది చేతులు, కాళ్ళు, గోళ్ళు. సాధారణంగా ముఖం చూసిన వెంటనే కాళ్ళు చేతులు గమనిస్తారు. కానీ, చేతులపై దృష్టి పెట్టకపోతే... అక్కడా మృతకణాలు పేరుకుంటాయి. గరుకుగా మారి కాంతి విహీనంగా కనిపిస్తాయి. అయితే చేతులు అందంగా, మృదువుగా మారాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉప‌యోగిస్తే మంచిదంటున్నారు.

 

అందులో ముందుగా.. నిమ్మరసం, కొబ్బరినూనె, గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు చేతులకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చేతులు మృదువుగా, అందంగా తయారవుతుంది. ఇక మీరు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ముఖానికే కాదు... చేతులకి కూడా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి. త‌ద్వారా ఎండ ప్రభావం పడకుండా ఉంటుంది. మ‌రియు చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే కఠిన రసాయనాలు, ట్రై క్లోజన్ వంటి కఠిన రసాయానాలు కలిగిన సోపులను వాడటం వల్ల చేతులు పొడిబారడం లేదా పగుళ్ళు ఏర్పడం జరుగుతుంది. 

 

అందుకే అలాంటి వాటిని ప‌క్కన పెట్టి.. వాటి బదులుగా టీట్రీ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ వంటి నేచురల్ యాంటీబ్యాక్టిరియల్ సోపులను యూజ్ చేస్తే.. చేతులు మృదువుగా మార‌తాయి. ఇక అరచేతిలు మృదువుగా మారడానికి షియా వెన్న బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే  కొంచెం షియా వెన్నను వేసి అర‌చేతుల‌ను రుద్దుకోవాలి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేస్తే చేతులు మృదువుగా, అందంగా మారతాయి. మ‌రియు కొద్దిగా చక్కెర, ఉప్పు తీసుకుని.. అందులో కాస్త తేనె చేర్చి, చేతులకు రాసుకోవాలి. మృతకణాలు తొలగిపోయి చర్మానికి రక్తప్రసరణ చక్కగా అందుతుంది. మ‌రియు చేతులు మృదువుగా తయారవుతాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: