ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అన్ని పనులు త్వర త్వరగా పూర్తి అవ్వాలి అనుకుంటారు. అవే వాళ్ళ కొంపలు ముంచుతాయి. కొన్ని పనుల కారణంగా వాళ్ళ అందం తాత్కాలికంగా పెరిగినప్పటికీ ఆ అందం తగ్గుతుంటుంది. తాత్కాలిక అందాన్ని చూసి మురిసిపోయిన అమ్మాయిలకు చివరికి కన్నీళ్లే మిగులుతాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. 

 

IHG

 

ఇకపోతే తలా స్నానం చేశాక జుట్టు అర్పుకోవడానికి కూడా కొందరు ఆడవాళ్లకు టైం ఉండటం లేదు. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్లు అయితే ఫ్రీగా జుట్టు అర్పుకోవచ్చు కానీ ఉద్యోగాలకు పరుగులు పెట్టె ఆడవారికి జుట్టు అర్పుకోవడానికి సమయం ఎక్కడ  దొరుకుతుంది. ఇంకా అందుకే కొందరు ఒత్తైన జుట్టు ఉన్న వారు డ్రయ్యర్‌ వాడకం మొదలు పెట్టారు. 

 

IHG

 

అయితే డ్రయ్యర్‌ వాడకం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి ఏంటి అంటే? బ్లో డ్రయ్యర్‌ వాడకం వల్ల జుట్టు చివరలు చిట్లిపోవటం, మాడుమీది సహజ తైలాలు తగ్గిపోయి జుట్టు పొడిబారి కళ తప్పటం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వచ్చేస్తాయి. ఇంకా అలాంటి ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే డ్రయ్యర్ వాడకం తగ్గించాలి. 

 

IHG

 

కాస్త ముందే లేచి ఉరుకు పరుగు కాకుండా తలస్నానం చేసి కాస్త ఆరనివ్వాలి. సూర్య రష్మీ ప్రభావానికి జుట్టు దెబ్బ తినకుండా హీట్‌ప్రొటెక్షన్‌ స్ప్రేలు వాడటం మంచిది. ఇంకా డ్రయ్యర్‌ని వాడేటప్పుడు జుట్టుకు కాస్త దూరంగా పెట్టి వాడాలి. ఇంకా వాడే సమయంలో తక్కువ వేడి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే జుట్టు అందంగా తయారవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: