క్యారెట్.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. క్యారెట్ అందరికి సుపరిచితమైన టేస్టీ వెజిటేబుల్. ఇక కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టపడరు. ఇక క్యారెట్‌లో ఎన్నో ఆరోగ్యప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా అలాగే క్యారెట్‌ను రోజూ తినడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెర‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే క్యారెట్ కేవ‌లం ఆరోగ్య‌ప‌రంగానే కాకుండా చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

 

ఎందుకంటే.. కాంతివంతమైన చర్మం కోసం ఒక ఉత్తమ వెజిటేబుల్ ఏదైనా ఉందంటే అది క్యారెట్. ఎందుకంటే క్యారెట్‌‌లో ఉంటే.. విటమిన్ సి వృద్ధాప్యం, ముడుతలతో సంబంధం ఉన్న ఫ్రీరాడికల్ చర్యను నిరోధిస్తుండగా, బీటా కెరోటిన్ చర్మ మంటను నివారిస్తుంది. మ‌రి క్యారెట్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి..? అన్న‌ది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. అందుకు ముందుగా.. కేరట్ ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

 

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోయి.. కాంతివంతంగా మారుతుంది. అలాగే ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ రోజ్ వాటర్, పావు టీస్పూన్ చందనంపొడి చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేయాలి. అర‌గంట త‌ర్వాత‌ ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖంపై పేరుకుపోయిన మ‌లినాల‌ను తొల‌గించడంతో పాటు చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించేందుకు.. క్యారెట్ జ్యూస్ మ‌రియు నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. అర‌గంట త‌ర్వాత క్లిన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.
 
    

మరింత సమాచారం తెలుసుకోండి: