యాపిల్ ఆరోగ్యానికి ఎంత మంచిది అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది అంటారు. ఎందుకంటే.. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉంటాయి. యాపిల్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. కాబ‌ట్టి.. రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అయితే యాపిల్ కేవ‌లం ఆరోగ్య‌ప‌రంగానే కాకుండా సౌంద‌ర్య ప‌రంగా ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.

 

వాస్త‌వానికి చర్మ సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడడం వల్ల రసాయనాలతో దుష్ప్రభావం బారిన పడే ప్రమాదం ఉంది. కానీ, మ‌న‌కు అందుబాటులో ఉంటే యాపిల్‌ను చ‌ర్మానికి ఉప‌యోగిస్తే ఎలా స‌మ‌స్య‌లు ఉండ‌వు. మ‌రియు చ‌ర్మం ఆరోగ్యంగా, య‌వ్వ‌నంగా మార‌తుంది. మ‌రి యాపిన్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా ఒక యాపిల్‌ ని సన్నగా తురుముకోవాలి. తురుముకున్న యాపిల్‌ ముక్కలికి దానిమ్మ రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.

 

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొట‌మ‌లు, మ‌చ్చ‌లు తొలిగించ‌డంతో పాటు ప్ర‌కాశవంతంగా మారుతుంది. అలాగే సూర్యకాంతి యొక్క రేడియేషన్‌ ప్రభావం నుండి మన చర్మానికి యాపిల్ రక్షణ ఇస్తుంది. అందుకే ఎప్పుడైనా ఎండలోకి వెళ్లాల్సివ‌స్తే అప్పుడు ఓ యాపిల్ తినండి. ఇలా చేస్తే ఎండ కారణంగా మీ చర్మానికి ఎటువంటి హానీ జరగదు. ఇక‌ కొంచెం యాపిల్ పేస్ట్‌ను చేతిలోకి తీసుకొని అందులోకి తగినంత తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట‌ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: