పైనాపిల్.. ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాల్లో పైనాపిల్ కూడా ఒక‌టి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. అలాగే పైనాపిల్‌లో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. మ‌రియు పైనాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. 

 

ఇలా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న పైనాపిల్ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. మ‌రి పైనాపిల్ చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. పైనాపిల్ ను మెత్తగా పేస్ట్‌ చేసి అందులో ఎగ్ వైట్, కొద్దిగా పాలు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుని అర గంట త‌ర్వాత‌ చల్లని నీటితో క్లీన్‌ చేసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకోవడంతో పాటు తేమను కూడా కోల్పోకుండా ఉంటుంది. మ‌రియు ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

 

అలాగే బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో పైనాపిల్ ముక్కతో స్క్రబ్ చేయాలి . ప‌ది నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ముఖానికి పోషణ అందివ్వడంతో పాటు, డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమ‌లు కూడా త‌గ్గుతాయి. అదేవిధంగా, పైనాపిల్ గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెదాలకు రాసుకుంటే.. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. మ‌రియు  పైనాపిల్ జ్యూస్ లో నిమ్మరసం కలిపి రాస్తే చర్మం యవ్వనంగా కనపడటమే కాకుండా ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తుంది

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: