మెంతులు.. ఇవి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే ఔషధాల్లో మెంతులు కూడా ఒక‌టి అన‌డంలో సందేహం లేదు. ఎన్నో పోష‌కాలు ఉన్న మెంతుల‌ను ప్రతి రోజూ మన ఆహారంలో వాడుతుంటాం. ముఖ్యంగా మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ ఇలా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకుంటాం. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతులు.. ముఖాన్ని మెరిపించ‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌రి అదెలాగో ఇప్పుడ తెలుసుకుందాం.

IHG

ఒక స్పూన్ల మెంతులను పాలలో గంట పాటు నానబెట్టి.. అనంత‌రం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే.. మెంతులను చర్మం కాంతివంతంగా మరియు తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అలాగే మెంతుల‌ను తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో క‌లిపి ముఖానికి అప్లై చేసి.. అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

IHG

అదేవిధంగా, మెంతి పౌడర్ ని పెరుగులో కలిపి..  ముఖానికి, మెడ‌కు అప్లై చేసి అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే.. మెంతులు చర్మానికి మాయిశ్చరైజర్ ని అందించి. డ్రై అవకుండా ర‌క్షిస్తుంది. అలాగే మెంతి పొడికి కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో మలినాలను తొలగిస్తుంది. త‌ద్వారా ముఖం కాంతివంతంగా క‌నిపిస్తుంది.

 
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: