సాధార‌ణంగా చాలా మంది జిడ్డు చ‌ర్మంతో బాధ‌ప‌డుతుంటారు. కాలం ఏదైనా కొంద‌రి ముఖం జిడ్డుగానే ఉంటుంది.  ఫలితంగా, ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి భంగపడతారు. వాస్త‌వానికి వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది మరియు స‌మ‌స్య‌ను తగ్గించేవి కావు. కాని, స‌హ‌జ‌సిద్ధమైన‌వి ఉప‌యోగించ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. 

 

అయితే జిడ్డు చ‌ర్మాన్ని త‌గ్గించ‌డంలో వేపాకు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. వేప పేస్ట్ చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను త‌గ్గించ‌గ‌ల‌దు. దాని కోసం వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పావు గంట ఆర‌నిచ్చి.. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారినికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వేపాకు జిడ్డ చ‌ర్మానికే కాదు, మ‌రెన్నో సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వేపాకు పేస్ట్ చేసుకుని అందులో నిమ్మ మరియు రోజ్ వాట‌ర్ మిక్స్ ముఖానికి అప్లై చేయాలి.

 

పావు గంట త‌ర్వాత పావు గంట ఆర‌నిచ్చి.. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెటిమలు, మచ్చలు పూర్తిగా తొలగించి ముఖంలో కొంత కాంతులను నింపుతుంది. అలాగే వేపాకును నీళ్లలో వేసి కాగబెట్టండి. ఆ నీటితో స్నానం చేయడం వల్ల.. వేపాకులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరానికి క్రిముల నుండి రక్షణ కలుగుతుంది. మ‌రియు ఎలర్జీలు తగ్గిస్తుంది. అదేవిధంగా, వేపా ఆకులను వేడినీటిలో ఉడికించి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించాలి.  పావు గంట త‌ర్వాత పావు గంట ఆర‌నిచ్చి.. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా మారుతుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: