ప్ర‌తిఒక్క‌రి ఇంట్లోనూ విరివిరిగా ఉప‌యోగించే ఉల్లిపాయ‌లు.. ధ‌ర త‌క్కువ‌, పోష‌కాలు ఎక్కువ‌. యాంటీసెప్టిక్‌, యాంటీ బయాటిక్‌, యాంటీ మైక్రో బాక్టీరియల్‌ లక్షణాల నిల‌య‌మైన ఉల్లిపాయ.. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల నుంచి ర‌క్షిస్తుంది. శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ చేయ‌డానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లిపాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, రసాయన పదార్థాలు శరీరంలో రోగనిరోధకశక్తిని బ‌ల‌ప‌రుస్తాయి.

IHG

అయితే ఆరోగ్యానికి కాదు, చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ ఉల్లి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి ఉల్లిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. ఉల్లి రసం తీసుకుని.. అందులో శెనగపిండి, మీగడ కలిపి ముఖం మీద అప్లై చేయాలి. పావు గంట తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. మ‌రియు పిగ్మెంటేషన్‌ తగ్గి చర్మం తెల్లగా మారుతుంది. 

IHG

అలాగే ఉల్లి రసాన్ని నేరుగా ముఖానికి అప్లే చేసి.. అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే.. చ‌ర్మం మృదువుగా మ‌రియు కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా, ఉల్లిర‌సం తీసుకుని.. అందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.  పావు గంట తర్వాత చల్లని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మృత‌క‌ణాలు తొల‌గుతాయి. మ‌రియు నీర్జవంగా ఉన్న చ‌ర్మాన్ని ప్ర‌కాశవంతంగా మారుతుంది. కాబ‌ట్టి, ఈ టిప్స్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: