మొటిమలు రావడం అనేది సర్వ సాధారణమైన విషయమే, హార్మోన్స్ ప్రభావం వలన కొంతమంది మొటిమలు వస్తే, మరి కొంతమందికి కాలుష్య ప్రభావం, పోషకాల లోపం వలన వస్తూ ఉంటాయి.అయితే వేసవి కాలంలో చాలామందికి తలలో కూడా అధికంగా మొటిమలు వస్తూ ఉంటాయి. చెమట కాయలు కూడా వీటిని పేర్కొన్నా, మొటిమలుగానే మనం భావించాలి. ఒక్క వేసవిలో మాత్రమే కాదు. చర్మంపై మృత కణాలు పేరుకుపోయినపుడు తలపై రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు ఏర్పడుతాయి.ఇవి దువ్వెనతో దువ్వుకునే సమయంలో మరింత భాదని కలిగిస్తాయి. మరి ఈ సమస్యని సహజ పద్దతుల ద్వారా ఎలా అధిగ మించాలో ఇప్పుడు చూద్దాం.

 Image result for తలలో మొటిమలు

ఆలివ్ ఆయిల్ ఈ మొటిమల నివారణకి చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ తీసుకుని , అందులో టీ చెట్టు ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి మసాజ్ చేస్తే తప్పకుండా ఈ మొటిమలు నివారించబడుతాయి.

 Image result for తలలో మొటిమలు

పసుపు సర్వ రోగ నివారిణి ఈ విషయం అందరికి తెలిసిందే, మొటిమలు నివారించడంలో కూడా పసుపు కీలక పాత్ర పోషిస్తుంది.  అందుకే స్వచ్చమైన పసుపు ఒక స్పూన్ తీసుకుని, అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి పేస్టూ అయ్యేవరకూ కలియ తిప్పాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి ఒక గంట తర్వాత కుంకుడు కాయలు, లేదా శీకాయ తో  తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన తలపై వచ్చే మొటిమలు పూర్తిస్థాయిలో నివారించబడుతాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: