ఇంట్లో నుంచీ బయటకి వెళ్ళాలి అంటే చర్మాన్ని కాపాడుకోవడానికి ఆడవాళ్ళు పడరాని పాట్లు లేవు..దుమ్ము, దూళి ,కాలుష్యం నుంచీ తప్పించుకోవడానికి  పడరాని పాట్లు అన్ని పడవలసి వస్తుంది..పల్లెల్లో ఉండే వాళ్ళు  పట్టణాలలో కొన్ని రోజులు ఉంటే చాలు కాలుష్య ప్రభావం చర్మంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవచ్చు..అయితే ఇప్పుడు అసలే చలికాలం దానికి తోడూ చర్మం పిడసగట్టిపోతుంది..ఎన్ని క్రీములు రాసినా ,చర్మం మాత్రం యధాస్తానినికి మారాడు..అయితే చర్మం మెరుపులా మెరిసేలా ఉండాలి అంటే..ఎంతో పోషక ఆహారం తీసుకోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

 Image result for winter season skin are fruits

అయితే కొన్ని రకాల పండ్లు ,ఆకు కూరలు తినడం వలన చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు బచ్చలికూర..బీట్‌రూట్ వంటి కూరగాయల సలాడ్‌ లేదా రసాలు మంచివని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలతో చేసిన సలాడ్ లేదా రసాలు తీసుకునేటప్పుడు వాటిపై కొంచెం జనుము గింజలు చల్లుకోవడం కూడా మంచిదట. అంతేకాదు చర్మా సౌందర్యాన్ని కాపాడే విటమిన్-ఈ  జనుము..బాదం వంటి గింజల్లో ఉంటుంది..

Image result for winter season skin are fruits

అయితే ప్రకృతి కూడా చలికాలంలో మనిషికి , జంతువులకి ఎటువంటి ఆహరం అవసరమో అటువంటి ఆహారాన్ని అందిస్తుంది..అందుకే చలికాలంలో ఎక్కువగా దొరికే...చలికాలంలో మనకు అందుబాటులో ఉండే బీట్‌రూట్, బచ్చలి, ఉసిరి వంటి కూరగాయల రసాలు తీసుకుంటే చర్మం మెరుస్తుంది..చర్మానికి ఏ కాలంలో అయినా సరే ఉపయోగపడేవి టమోటాలు..అవి చర్మానికి చాలా మంచివని, చర్మం తేమగా..ఉంటుంది అని చెప్తున్నారు వైద్యులు.

 Image result for winter season skin are fruits

మనం పూర్వం అవలంభించిన కొన్ని పద్ధతుల్ని కూడా పాటించవచ్చు..మంచి గంధం చెక్కని తీసుకుని దానిని అరగదీసి వచ్చిన గంధం ని కొంచం పల్చగా చేసుకుని చర్మానికి పట్టించి ఒక గంట తరువాత కడిగేస్తే మీ చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: