ఒకప్పుడు చుండ్రు పట్టడం అంటే చాల తక్కువ మంది దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండేవారు కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న సమస్య చుండ్రు..ఈ శీతాకాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది..ఇప్పుడు మారుతున్న పరిస్థితులు పోషక ఆహార లోపం..చుండ్రు పట్టడానికి కారణాలు అవుతున్నాయి..ఈ చుండ్రు కుదుళ్ళకి బాగా పట్టి ఉండటం వలన అంత తొందరగా పోదు..అంతేకాదు జుట్టు రాలిపోయే ప్రమాదం ఈ చుండ్రు వలన కలుగుతుంది..

 Related image

 చుండ్రు జుట్టుకి పట్టుకుని ఉండటం వలన ఎంతో ఫ్రెష్ గా కనిపించే జుట్టు సైతం నిర్జీవంగా కనిపిస్తుంది..అయితే చుండ్రు రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామరలు.

బ్యూటీ స్టోర్స్ లో చుండ్రుని పోగొట్టడానికి అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ అందుబాటులో వున్నాయి.అయితే వాటికి బదులుగా రసాయనిక పదార్ధాలు వాడని పద్దతులు పాటించడం ఉత్తమం..

 Image result for dandruff control natural remedies

సహజ పద్దతులు పాటించడం ద్వారా చుంద్రుని నివారించవచ్చు అందులో భాగంగా...చుండ్రు సమస్యకి ఉల్లిపాయ రసం ఎంతో బాగా పనిచేస్తుంద..ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సమృద్ధంగా నిండివున్న ఉల్లిపాయ రసం చుండ్రు సమస్యను ఎదుర్కోవటానికి మరియు మళ్ళీ రాకుండా నివారించవచ్చు. అయితే చుండ్రు సమస్యని చక్కదిద్దటానికి ఎన్నో రకాల పద్దతులు ఉన్నాయి వాటిలో కొన్ని తెలుసుకుందాం..

Image result for lemon for dandruff

ఒక ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కోసం మిక్సీలో వేసి రసం తీసుకోవాలి...ఆ రసంలో నుంచీ రెండు స్పూన్స్ ఉల్లి రసం తీసుకుని దానిలో 3-4 టీస్పూన్ల నిమ్మ రసం కలపండి. ఆతరువాత రెండు మిశ్రమాలను బాగా కలిపి, చుండ్రు వున్న ప్రాంతంలో రాయాలి. - 5 నిమిషాల పాటు మీ చేతివేళ్ల తో స్కాల్ప్ ని మసాజ్ చేయండి.సరిగ్గా 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి..ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ మూడు వారాలు చేస్తూ ఉంటే  చుండ్రు సమస్య యిట్టె పోతుంది..

 Image result for lemon for dandruff

నిమ్మకాయ చెక్కతో తలకి బాగా రుద్ది మర్దనా చేసి ఒక పావు గంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది అయితే ఈ పద్దతిని వారానికి ఇలా రెండు సార్లు అయినా చేస్తూ ఉండాలి..ఇలా మూడు వారాలు చేస్తే తలపై చర్మం మీద ఉండే చుండ్రు తాలూకు మృత చర్మం పోర తెగిపోతుంది..తద్వారా చుండ్రు నయం అవుతంది..




మరింత సమాచారం తెలుసుకోండి: