మనలో చాలా మందికి ముఖం జిడ్డు కారుతూ ఉంటుంది..వాతావరణం పొడిగా ఉన్నా లేక కూల్ గా ఉన్నా ఎలా ఉన్నా సరే  ఈ జిడ్డుదనం ఎక్కువగా చుపుతుంది. అయితే ఈ పరిస్థితి అందరికీ ఎదురయ్యే సమస్య కాదు. కొంతమందిలో మాత్రమే ఈ తరహా సమస్య ఉంటుంది..అయితే మనం ఈ సమస్యని అధిగమించడానికి ఇంట్లో లభించే పదార్ధాలతో తగ్గించుకోవచ్చును.

 Image result for wet face

జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోని పది నిమిషాల తరువాత కడిగేయాలి..స్నానానికి పదిహేను నిమిషాల ముందు యాపిల్‌ను సన్నని ముక్కలుగా కోసుకుని ముఖం మీద ఉంచుకుంటే..యాపిల్ చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

 

అంతేకాదు అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆ మిశ్రమంని కూల్ వాటర్ తో కడిగితే జిడ్డు తగ్గి చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. నాలుగైదు బాదంపప్పుల్ని రాత్రంతా నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి. జిడ్డు చర్మతత్వానికి మంచి ప్యాక్ ఇది.
Image result for oil skin face
పసుపుని కూడా ఈ ప్రయత్నంలో భాగంగా వాడుకోవచ్చు పసుపులో ముఖ్యంగా యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి...మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే  ముఖం ఎంతో తాజాగా ఫ్రెష్ గా ఉంటుని
Image result for oil skin face lemon
నిమ్మకాయ సర్వ రోగాలలో ఉపయోగిస్తారు..జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం ఎంతో చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో కొచం నీళ్ళు కలిపి..మెత్తగా వచ్చిన మిశ్రమాన్ని ఉండలుగా చేసి  ఆ ఉండల్ని ఫ్రిజ్‌లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే చర్మం ఎంతో కోమలంగా తయారవుతుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: