కరివేపాకులు మనం ఎక్కువగా కూరలలో ,తాలింపుల్లో వేస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి కాబట్టి..కళ్ళకి ఎంతో మేలుని చేకూర్చుతాయి..అయితే కరివేపాకు తినడానికి మాత్రమే కాదు శరీర సౌందర్యానికి కూడా  వాడుతూ ఉంటారు..జుట్టు పోషణకి కూడా తలకి పట్టిస్తూ ఉంటారు...ముఖం యొక్క అందం ,జుట్టు మెరుపుదనం ఇలాంటి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖం యొక్క వచ్చస్సు పెరుగుతుంది..ఇలా కరివేపాకుతో ఎన్నో లాభాలు ఉన్నాయి..

 Image result for curry leaves

యుక్తవయస్సు వచ్చిన తరువాత ప్రతీ ఒక్క యువతీ యువకులలో వచ్చే ప్రధానమైన సమస్య మొటిమలు..మగవారికంటే కూడా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది..అయితే చాలా మందికి ముఖంపై మొటిమలు వచ్చిన తరువాత తగ్గిపోయి అవి మచ్చలుగా ఏర్పడుతాయి..అయితే అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు..కొన్ని వేపాకులను తీసుకుని కాస్త నీరు చేర్చి మెత్తటి పేస్టులా చేయాలి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలు వచ్చిన చోటా రాయాలి. ఇలా తరచూ చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.
Related image
మొటిమలు వలన కలిగే మచ్చలు తగ్గని వాళ్ళు కరివేపాకు పేస్టులో ముల్తానీ మట్టి , రోజ్ వాటర్ కలిపి రాసుకోవాలి. పదినిమిషాల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే మచ్చలు మాయమై చర్మానికి నిగారింపు వస్తుంది..అంతేకాదు కరివేపాకు పేస్టులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మచ్చలున్న చోట రాయాలి. ఇలా తరచూ చేసినా మచ్చలు పోతాయి.  యాంటిఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే ఆలివ్ ఆయిల్ వంటికి పట్టించడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది.

 Image result for curry leaves skin benefits

అయితే ఇప్పుడు జుట్టు రాలిపోకుండా కరివేపాకులా  కూడా కరివేపాకులు బాగా ఉపయోగపడుతాయి. కొబ్బరినూనెని గోరువెచ్చగా మరగబెట్టి అందులో కొన్ని కరివేపాకు నూనెలో బాగా నాననివ్వాలి. తలస్నానం చేసే ముందు ఆ నూనె బాగా తలకి పట్టించి ఓ అరగంట తరవాత తలకి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్న తనంలో జుట్టు నెరిసిపోయే సమస్య తగ్గుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: