ఈ మద్య యువతను పట్టి పీడిస్తున్న సమస్య చుండ్రు. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఎక్కువ సమయం ఎసిలో ఉండటం, రోజంతా ఫాన్ గాలికి కూర్చోవటం, తలస్నానం సమయంలో వాడిన షాంపు పూర్తిగా పోకుండా మాడుకు అంటుకోవటం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యల మూలంగానూ ఈ సమస్య రావచ్చు.చుండ్రు సమస్యకు నేరుగా మందులు వాడటం కంటే ఇంట్లోనే చేసుకునే పదార్థాలను వాడి తగు జాగ్రత్తలు పాటించటం మంచిది. 

Image result for dandruff

  • తలస్నానం చేసినప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి. కండిషనర్ వాడిన తర్వాత తలను శుభ్రపరచటంతో బాటు తలస్నానం తర్వాత షాంపూ అవశేషాలు జుట్టు, మాడు మీద లేకుండా చూసుకోవాలి.
  • తలకు ఎండ, గాలి తగలకుండా కప్పి వుంచకూడదు. పొడి చర్మం ఉన్నవారు అవసరాన్నిబట్టి తగిన మాయిశ్చరైజర్, షాంపూ, హెర్బల్ కండిషనర్ ఎంపిక చేసుకొని వాడాలి.
  • ఉసిరిలోని ఐరన్‌ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది గనుక నిమ్మరసంలో ఉసిరి రసం లేదా ఉసిరి పొడి కలిపి తలకు బాగా పట్టించి మర్ధన చేసి ఓ గంట తర్వాత స్నానం చేయాలి.
  • 4 గోరువెచ్చటి కొబ్బరినూనెలో 2 చెంచాల నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట పాటు మర్దన చేసి వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది. వారానికి 2 సార్లయినా ఇలా చేయాలి.
  • మెంతులు నానబెట్టి రుబ్బి తలకు పట్టించి మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఎంతటి చుండ్రయినా వదిలిపోతుంది
  • చుండ్రు బాధితులు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థం ఉండేలా చూసుకోవాలి. విటమిన్ -ఎ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా గింజలు, కాయగూరలు,చేపలూ తీసుకోవాలి. వేప్పుళ్ళకు మాత్రం దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: