1. కళ్ళు : మన శరీరంలో ప్రధానమైనవి.అందుకే మన పెద్దలు "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న కనులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? పాతకాలంలో ఐతే కళ్ళకు చక్కగా కాటుక పెట్టుకునేవారు స్త్రీలతో పాటు పురుషులు కూడా!!కానీ రాను రాను కాటుక పెట్టుకునే వారు తక్కువ అయ్యారనే చెప్పాలి.కాటుక లో ఉండే సుగుణాలు చెప్పటం అసాధ్యం.మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక మంచి కారణం ఉంటుంది.అందుకే ఈ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి కాటుకకు సంబంధించిన చిట్కాను అందించబోతున్నాను.దీన్ని మీరే ఇంట్లో తయారుచేసుకుని మీ కళ్ళ సమస్యలను పోగొట్టుకోవచ్చు.దీన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.దీనికి కావలసినవి..పెద్ద ఉల్లిపాయ రసం, మంచి తేనె, ఒక్క నలుసు పచ్చ కర్పూరం.ఒక్క బొట్టు ఉల్లిరసం తీసుకుని ఒక ప్లేట్ లో వేసి అందులో ఒక్క చుక్క తేనె,ఒక్క నలుసు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపితే కాటుక వస్తుంది. దీన్ని రోజూ కళ్ళకు పెట్టుకోవటం వల్ల కంట్లోని పొర, నలుసులు, దృష్టి లోపం వంటి సమస్యలు కేవలం 20 రోజుల్లోనే నివారించబడతాయి.
Image result for eyes
2 ఉబ్బసం తో బాధ పడేవారికి :  ఉబ్బసం తో బాధ పడేవారికి ఒక మంచి "మన అమ్మ" చిట్కా.. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు (ఇలాచి)ను, దంచి లోపలి గింజలను తినాలి. అంతే ఇక ఆ రాత్రి ఉబ్బసం మిమ్మల్నిబాధించదు .
Image result for ఉబ్బసం
3 . అందమైన పాదాల కోసం : పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో "మన అమ్మ"చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి. పాదాలు ఎక్కువగా నీటిలో తడవకుండా , బాక్టీరియా పాదాలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . వారానికి ఒకసారైనా పాదాలకు యాంటిఫంగల్ క్రీమ్‌ ను రాయాలి . పాదాలకు ధరించే సాక్స్ విషయము లో పర్తిరోజూ ఉతికినవి మార్చాలి . పాదాలకు పగుళ్ళు ఏర్పడితే వైట్ పెట్రోలియం జెల్లీ రాస్తుండాలి .
Image result for పాదాలు
4. అందమైన చేతుల కోసం : చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవి గా చెప్పుకున్నాం కదా..ఈ పొస్ట్ లో కూడా ఒక మంచి సులువైన "మన అమ్మ"చిట్కాను చెప్పబోతున్నాను.ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి. రోజుకి నాలుగు సార్లైనా మాయిశ్చరైజర్ క్రీమ్‌ చేతులకు రాస్తుండాలి . గోళ్ళు అందం గా కనిపించడానికి కాల్సియం ఎక్కువగా లబించే ఆహారము తినాలి .
Image result for చేతులు
5 .అందమైన పెదవుల కోసం : పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ ఈ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల కూడా పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి.కొద్దిపాటి ఖర్చు తోనే మనం ఈ సమస్యను అధిగమించవచ్చు.నాకు తెలిసిన , మనపూర్వీకుల నుండీ వస్తున్న ఒక మంచి ఆయుర్వేద చిట్కా ను మీకు కూడా చెప్పబోతున్నాను.ఆయుర్వేదం కూడా వేదాలలో ఒక భాగమే…అదేమిటో తెలుసుకుందాం "మన అమ్మ" చిట్కాలో..దీనికి కవలసిన పదార్ధాలు..జాజికాయ - 50గ్రా, పాలు- సరిపడా, దంచిన పసుపు - 50గ్రా, నాటు ఆవు నెయ్యి - 50గ్రా.
Image result for పెదాలు
జాజికాయలను పగలగొట్టి పై బెరడుని దంచి పొడి చేయాలి.తరువాత స్టవ్ వెలిగించి, ఒక గిన్నె లో పాలు పోసి పైన వస్త్రం కట్టాలి.ఈ వస్త్రం లో జాజికాయపొడిని వేయాలి.ఇలా ఒక 10నిమిషాలు ఉంచి , తీసి ఈ పొడిలో పసుపు కలిపి,గాజు సీసాలో నిల్వ చేసుకుని, పెదవులు నల్లగా ఉన్నవారు, పొక్కులు వచ్చిన వారు, అంచులు పగిలిన వారు రాత్రిపూట మాత్రమే నెయ్యిలో ఈ పొడిని తీసుకుని బాగా రంగరించి, పెదవులకు పట్టించి మృదువుగా మర్దనా చేయండి.దీనివల్ల పెదవులు తేనెలూరుతూ, ఎర్రగా నిగనిగలాడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: