అందం గా ఉండాలనే కోరిక ప్రతిఒక్కరిలొనూ ఉంటుంది . నేడు ఆ అందచందాల్ని పొందడానికి బ్యుతీపార్లర్లను ఆశ్రయిస్తునారు . .. లేదా వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చరం సమస్యలు తలెత్తుతున్నాయి .

Image result for కుంకుమ

కుంకుమ ,కాటుక , తిలకం వంటివన్నీ సౌందర్య సాధనాలే . పసుపు , పెరుగు , మీగడ , కోడిగుడ్డు వంటివాటివన్నీ ఉపయోగించుకొని చర్మ సౌందర్యం పెంచుకోవచ్చును . కొన్ని టిప్స్ చూద్దాం .
 Image result for టమాట గుజ్జు
1 . ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది.
Image result for పైనాపిల్ రసం
2. ముకం మీద ముడతలు వస్తే ముసలితనాన్ని ఎత్తిచుపుతుంది .. దీనికిగాను పైనాపిల్ రసం , యాపిల్ రసం , నిమ్మరసము ఒక్కో స్పూను చొప్పున్న తీసుకొని బాగా కలియబెట్టి ముఖానికి పట్టించి , ముఖం కడుగుకోవాలి . ముడతలు తగ్గిపోతాయి ..ఒక వారం రోజులు చేస్తే .. ఇలా ప్రతి వారం ఒకసారి చేయాలి .
Image result for జిడ్డు ముఖం
3 . జిడ్డు ముఖం ఉన్నవారు విచారించానవసరం లేదు ... ముఖం మీద గుడ్డు సొనను రాసుకోండి . ముఖం ఎండిన రీతిలో నుంటే పచ్చ సోన ను తీసుకొని బాగా గిలకకొట్టి ముఖానికి రాసుకొని 15 నిముషాలు ఉంచి కడుక్కోవాలి . గుడ్డు సోనలు రెండు చరం మీదుండే రంధ్రాల వెడల్పును తగ్గించి , ముఖకారమం ముడుతలు రాకుండా చూస్తాయి . మడుదటలు తగ్గిస్తాయి . ప్రతి వారం ఒక రోజు చేయాలి .
Image result for బొప్పాయి గుజ్జు
4 . ముఖానికి వెలుగుకోసం ... గులాబి రంగుకోసం కాళ్ళు కొంచం ఎత్తు లో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి ,తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖం పై వెలుగుతుంది . వారానికి మూడు రోజులు చేస్తే సరిపోతుంది .

5. అందానికి పండ్లు పనికొస్తాయి ... ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు , ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి , 15 - 20 నిముషాలు ఉంది ముఖం కడుక్కోవాలి . ముఖ చర్మం బిగుతుగాను , కాంతివంతం గాను ఉంటుంది .
Image result for బొప్పాయి గుజ్జు
6 . ముఖం తజదనానికి ... తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి తర్వాత కడుగుకోవాలి . ముఖచారం మీద ఉన్న మృతకణాలు రాలిపోయి తాజాదనం వస్తుంది.

7 . ముఖం అందం లో శిరోజాల పాత్ర ... అందుకే వాటికి తగిన కన్డిసనర్ వాడాలి . అరటి , దోస , తమటోల గుజ్జు పెరుగు కలిసి తయారు చేసుకున్న ముద్దను శిరోజాలకు పట్టించి ఒక గంటసేపు ఉంది , ఆ తర్వాత శాంఫో తో తలస్నామం చేయాలి . శిరోజాలు చక్కగా వెలుగునిస్తూ కొత్త అందాన్నిస్తాయి .
Image result for ఆకుకూరలు
8 . అందానాని కి ఆహారము పాత్ర .... అందం కోసం ఎన్ని రకాల భాహ్య సాధనాలు వాడినా అసలు అందం శరీర ఆరోగ్యం ద్వారానే వస్తుంది . ఆకుకూరలు , పండ్లు , పాలు , వారి , గోధుమ మున్నగు వాటితో సంపూర్ణ ఆహారము తినాలి . యాంటి ఆక్షిదేంట్లు ఎక్కువగా తీసుకోవాలి ... క్యారత్స్ , గుడ్లు , పాలు మున్నగునవి .

9 . అందానికి కళ్లు పాత్ర .... ముఖానికి అందం కల్లనుండే వస్తుంది . కళ్లు కాతివంతం గా ఉండాలి , అలసిన కళ్లు అందాన్ని పాడు చేస్తాయి . కీర ముక్కలు కళ్లు మీద పెట్టుకుంటే అలసతపోతుంది . చల్లని దోసముక్కలైతే మంచిది . కనుబొమలు , కనురెప్పలు అందం గా ఉంచాలి . కాటుక కొద్దిగా పెట్టుకోవాలి .

10 . ముఖం మీద నల్ల మచ్చలు ముఖం అందం పాడుచేసతాయి . " బ్లాక్ హెడ్స్ గా " పేర్కొన్న వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి . పెరుగు , నల్లమిరియాలపొడి , కలిపిన ముద్దను ముఖం మీద ఉంచి  తరువాత కడుక్కోవాలి ... బ్లాక్ హెడ్స్ రారిపోతాయి .
Image result for వ్యాయామం
11 . అందానికి వ్యాయామము పాత్ర .... వ్యాయామం చేయడం వల్ల శరీరం లోని మలినాలు పోయి చర్మమ కాంతివంతం గా తయారువుతుంది . వ్యాయామము వలన రాకతప్రసరణ పెరిగి శరీర ఆరోగ్యం బాగుపడుతుంది .. అందువల చర్మ కణాలు కాన్తివంతమవుతాయి .

12. అందానికి నిద్ర పాత్ర .... ఆరోగ్యానికి , నిద్రకు ప్రత్యక్ష సంభందం ఉన్నది . తగినంత నిద్ర లేకపోతె దాని ప్రభావం శరీర ఆరోగ్యం పై పడుతుంది . నిద్ర లేమి కళ్లు అలసటగా కనిపిస్తాయి . అందవిహీనం గా కనిపిస్తాయి . నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగు తాయి . కొత్తకనాలు తయారవుతాయి . కొత్త కణాలు కొత్త అందాన్ని నిస్తాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: