రోజు రోజు కి తినే ఆహరం వలన..గాలిలో పెరిగిపోతున్న కాలుష్యం వలన చర్మం పాడయ్యి పోతూ చర్మ కాంతి తగ్గిపోతూ ముఖ్యం మేలిమి చాయని కోల్పోతుంది..చర్మం మీద మెరుపుని కోల్పోవడానికి ప్రధాన కారణం మాత్రం బయట నుంచీ వచ్చే ధూళి తినే ఆహరం అనేది వాస్తవం అయితే ఇటువంటి పరిస్థితుల్లో  కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ చర్మాన్ని కాపాడుకోగలరు.

 Image result for milk and honey face mask

పాలు మరియు తేనెలతో తయారు చేసిన కొన్ని పేస్ ప్యాక్ లు చర్మాన్ని కాపాడుతాయి..చర్మం కాంతివంతంగా మెరవడానికి దోహద పడుతాయి..తేనె  ని ఎన్నో సమస్యలకి ఔషధంగా వాడటం మనకి తెలిసిన విషయమే అయితే తేనే మొటిమలపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎంత శక్తివంతమైనదంటే, పొడిబారిన మరియు కాంతివిహీనమైన చర్మాన్ని ఇట్టే మరమ్మత్తు చేస్తుంది.

 Image result for milk and honey face mask

దీనిలో తేమను పునరుద్ధరించే లక్షణముంటుంది.తేనెను పాలతో కలిపినపుడు, యాంటీబాక్టీరియల్ లక్షణాలు పెంపొందించబడి, చర్మాన్ని లోతుగా పరిశుభ్రం చేస్తుంది. అయితే పాలలో ఉండే గుణాలు చర్మానికి కీడు చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడి, చర్మాన్ని నునుపుగా మరియు మృదువుగా ఉంచుతాయి..అయితే ఈ పాలు తేనే పేస్ మాస్క్ ని తయారు చేయడం ఎలా అంటే..
Image result for milk and honey face mask

ఒక గిన్నెలో 1/2 -1/3 కప్ పాలు.. తీసుకుని దానికి 3-4 టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలియపెట్టాలి...ఆ కలిసిన మిశ్రమంలో ఇప్పుడు మేకప్ బ్రష్ ను లేదా చూపుడు వేలు మధ్యవేలు ఉపయోగించి..ముఖంలో పొడి లేకుండా అంతా పట్టించాలి.. చెంపల వద్ద మరియు మొటిమలు ఎక్కువగా ఉన్న చోటా ఎక్కువగా పట్టించాలి..అంతేకాదు పల్చగా కాకుండా కొంచం మందంగా పట్టించండి..

 Image result for milk and honey face mask

పదిహేను నిమిషాలు పాటు ఆరనివ్వండి. పొడిబారినట్టు అనిపించినపుడు, తడి స్పాంజితో రుద్దుకుని తరువాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోండి...అయితే మెత్తని పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి.. ఇలా చేయడం వలన చర్మంపై ఉన్న రంద్రాలలోకి ఈ మిశ్రమం వెళ్లి చర్మాన్ని పాడవకుండా కాపాడుతుంది..అయితే ఇలా రెండు రోజులకి ఒక సారి చేసుకుంటూ ఉంటే మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: