ఆనాటి కాలం నుండి ఈ నాటి వరకూ అందం విష‌యంలో ఏ ఒక్కరూ రాజీ పడరు. ఆ విషయం అమ్మమ్మల ఫోటోలను చూసినప్పుడు తెలుస్తుంది. ఆ కాలంలోనే వారు చాలా బ్యూటిఫుల్ గా...గ్లామరస్ గా, సాప్ట్ అండ్ రేడియంట్ స్కిన్ కలిగి ఉంటారు. ఆ క్లియర్ నెస్ వారి ఫోటోలను చూసే చెప్పేయవచ్చు. ఎలాంటి బ్యూటీ క్రీములు మరియు మేకప్ ప్రొడక్ట్స్ ఉపయోగించకుండానే వారికి అంత అందం ఎలా సొంతమైంది.


ఈ కాలంలో వారి చర్మ సంరక్షణకు లేదా చర్మ అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఏవిధమైన కాస్మోటిక్స్, సర్జరీస్, మేకప్ సామాగ్రి, స్కిన్ ప్రొడక్ట్స్ వంటివి ఏవి లేవు . అయినా వారు అంత అందంగా కనబడుటకు కారణం ఏంటని ఆశ్చర్యం కలిగించవచ్చు.  నేచురల్ పదార్థాలతోనే చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం ఆరోజుల్లో వారికి బాగా అల‌వాటు.


అటువంటి నేచురల్ పదార్థాలు మన వంటగదిలోనో లేదా పెరట్లోనో ఉంటాయన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. మన వంటగదిలో ఉండే నేచురల్ పదార్థాలే స్కిన్ హెల్త్ కు గ్రేట్ బ్యూటీ ప్రొడక్ట్స్ . ఈ నేచురల్ రెమెడీస్ ను మనం ఇంట్లోనే చాలా ఎఫెక్టివ్ గా తయారుచేసుకోవచ్చు . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో ఉండే వివిధ రకాల కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి.
మొటిమలను నివారించేది...నీమ్ ఆయిల్ మరియు నిమ్మరసం రెండు మిక్స్ చేయడం వల్ల వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది . దాంతో చర్మంలో మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
 వేపనూనె మరియు నిమ్మరసం రెండూ కాంబినేషన్ కు కొద్దిగా తేనెను క‌లిపి చ‌ర్మానికి రాస్తే  ఇది చ‌ర్మం మెరుపుతో స‌హా మంచి గ్లోను కూడా తీసుకువ‌స్తుంది.  ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. ముడుతలు, ఫైన్ లైన్స్ కనబడకుండా చేస్తుంది. 


నీమ్ ఆయిల్ మరియు నిమ్మరసం కాంబినేషన్ ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మం మీద గ్రేట్ గా పనిచేస్తుంది. దాంతో స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.  నేచురల్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది: నీమ్ అండ్ లెమన్ కాంబినేషన్ నేచురల్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ఇది చర్మ రంద్రాలను తగ్గించడానికి, దాంతో చర్మం చూడటానికి మరింత స్మూత్ గా బెటర్ గా కనబడుతుంది.


ఈ  మిశ్రమం డీప్ గా చర్మ రంద్రాలను శుభ్రం చేసి, స్కిన్ క్లియర్ గా , హెల్తీగా కనబడేలా చేస్తుంది. ఈ
రెండింటి కాంబినేషన్ నూనెతో వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది, క్రిములు కుట్టడాన్ని నివారిస్తుంది, , అలర్జీలను, పులిపుర్లను నివారిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: