జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. రోజూ షాంపూ పెట్టి స్నానం చేసినా కొన్నిసార్లు చుండ్రు వదలదు. వాస్త‌వానికి చుండ్రు మృత చర్మం వలన తయరవుతుంది. ప్ర‌ధానంగా చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనబడే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది చుండ్రు రావటానికి దోహదపడుతుంది. అలాగే విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. తదితర అనేక కారణాల వల్ల చుండ్రు బాగా వస్తుంటుంది. అయితే చుండ్రుతో బాధ‌ప‌డేవారు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టండి..


- వేపనూనె, కానుగనూనె సమంగా కలిపి అందులో కొంచెం కర్పూరం వేసి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చుండ్రు చాలా వేగంగా చండ్రు స‌మ‌స్య తగ్గుతుంది.


- నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీటితో కడుక్కోవాలి.


- యాపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి రాసుకుని.. ఆ తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు త్వరగా తగ్గుతుంది.


- బేకింగ్ సోడాను తీసుకుని తడిగా ఉన్న జుట్టు, కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. ఒక రెండు నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చుండ్రు సమస్య సులువుగా తొలగిపోతుంది.


- చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం క‌నిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: